చంద్రబాబుని పొగిడిన వెంకయ్య, ప్రత్యేక హోదాపై షాక్
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని, రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో చంద్రబాబుకు తాను అభినందనలు తెలుపుతున్నానన్నారు.
దీనిపై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యేక హోదా పైన కూడా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చాలా హోంవర్క్ చేయాలన్నారు. మెజార్టీ రాష్ర్టాలు, ఎన్టీసీని ఒప్పించాల్సి ఉందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరాపరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. వాజపేయికి భారతరత్నతో ఆ అవార్డుకు మరింత వన్నెపెరిగిందన్నారు. వాజ్‌పేయి చూపిన అభివృద్ధి, సుపరిపాలన దిశలోనే ప్రధాని మోడీ సాగుతున్నారన్నారు.
కాగా, శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సామర్లకోటకు విచ్చేసిన వెంకయ్యకు హోంమంత్రి చినరాజప్ప ఘనస్వాగతం పలికారు.
కొణతాల చేరికపో గంటా, అయ్యన్న భేటీ
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను టీడీపీలోకి చేర్చుకునే విషయమై వారు చర్చించారు.












Click it and Unblock the Notifications