మై స్టేట్ కర్ణాటక: వెంకయ్య కోసం సడలింపు, నాలుగో సారి రాజ్యసభకు, రికార్డు సృష్టించారు

అమరావతి: దేశంలో ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పనుంది. ఇప్పటి వరకు బీజేపీ టికెట్‌పై ఆ పార్టీకి చెందిన ఏ నేత అయినా గరిష్టంగా మూడు సార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది.

అంతేకాదు బీజేపీలో మూడుసార్లకు మించి రాజ్యసభకు వెళ్లిన బీజేపీ నేతలు ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు. అయితే పార్టీలో సీనియర్ నేతగా, పార్జీ జాతీయ నాయకత్వంలో రాణిస్తోన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విషయంలో ఈ పరిమితి వర్తించడం లేదు.

ఇప్పటికే మూడు సార్లు బీజేపీ టికెట్‌పై రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య నాయుడు వరుసగా నాలుగోసారి ఆ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు వెళ్లనున్నారు. అంతేకాదు తనను మూడుసార్లు రాజ్యసభకు పంపిన కర్ణాటక నుంచే ఆయన నాలుగో సారి రాజ్యసభకు ఎన్నికకానుండటం విశేషం.

Venkaiah Naidu may elect from Karnataka to rajya sabha

ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ కర్ణాటక శాఖ వెంకయ్యను రాజ్యసభకు పంపే విషయమై ఓ తీర్మానాన్ని కూడా చేసింది. అంతకాదు ఒక నేతను మూడు సార్లే రాజ్యసభ సభ్యత్వం అన్న పరిమితిని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం వెంకయ్య విషయంలో సడలించింది.

జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే కర్ణాటక బీజేపీ శాఖ నుంచే వెంకయ్యను రాజ్యసభకు పంపించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ తతంగం అంతా పూర్తి అయినందువల్లనే మంగళవారం స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేస్తున్ సమయంలో బెంగుళూరు సిటీ తాజాగా ఈ రేసులో చేరిందని ఆయన ప్రకటించారు.

ఆ సమయంలో 'బెంగుళూరు కర్ణాటక రాజధాని. మై స్టేట్ కర్ణాటక' అని నొక్కి చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే కర్ణాటక నుంచే వెంకయ్య రాజ్యసభకు వెళ్లడం ఖాయమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్‌ను పార్టీ సేవలకు వినియోగించుకునే బదులు మంత్రిగానే కొనసాగించాలని అమిత్ షా నిర్ణయించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+