వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది పద్దతి కాదు: బాబుపై వెంకయ్య సంచలనం, జగన్‌కు ఊరట, పొత్తుపై..

బిజెపి - తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: బిజెపి - తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

<strong><br>నరేంద్ర మోడీపై నిర్మాతల ఫిర్యాదు, వెంటనే చంద్రబాబు ఆదేశాలు</strong>
నరేంద్ర మోడీపై నిర్మాతల ఫిర్యాదు, వెంటనే చంద్రబాబు ఆదేశాలు

పొత్తు విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన వెంకయ్య, ఏపీలో పార్టీ ఫిరాయింపులపై మాత్రం తెలుగుదేశం పార్టీకి షాకిచ్చే విధంగా మాట్లాడారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడారు.

పార్టీ ఫిరాయింపులు సరికాదు

పార్టీ ఫిరాయింపులు సరికాదు

పార్టీ ఫిరాయింపులు సరికాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి, మరో పార్టీలో చేరడం సరికాదని చెప్పారు. గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణల్లో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీలో 21 మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు టిడిపికి చెంపపెట్టు. అదే సమయంలో వైసిపి అధినేత జగన్‌కు వెంకయ్య వ్యాఖ్యలు ఊరట అని చెప్పవచ్చు.

టిడిపితో పొత్తుపై పుకార్లు నమ్మకండి

టిడిపితో పొత్తుపై పుకార్లు నమ్మకండి

టిడిపి - బిజెపి మధ్య పొత్తు ఉంటుందని, ఆగిపోతుందని వివిధ రకాలుగా ప్రచారం జరగడాన్ని వెంకయ్య ఖండించారు. పొత్తుపై విష ప్రచారం జరుగుతోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి, టిడిపిలు కలిసి పని చేస్తాయని చెప్పారు. ఈ అంశంపై పుకార్లు నమ్మవద్దన్నారు.

రూ.2.30 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాం

రూ.2.30 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వెంకయ్య చెప్పారు. ఏపీకి రూ. 2.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రకాశం జిల్లా రామయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామని వెంకయ్య అన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కోసం ప్రయత్నించాలని చెప్పారు. రంజాన్ తోఫాలు, సంక్రాంతి కానుకలు ప్రజలకు ఉపయోగపడవన్నారు.

గోవధపై పనిగొట్టుకొని ప్రచారం

గోవధపై పనిగొట్టుకొని ప్రచారం

గోవధ గురించి కొందరు పనిగట్టుకొని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. పశు ఆహారాన్ని తినవద్దని తాము చెప్పలేదని, వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు పంపించవద్దనేది మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. గోవధపై దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు.

English summary
Union Minister Venkaiah Naidu on Thursday responded on alliance with Telugudesam Party and MLAs defections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X