చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ మృతి-హైకోర్టు వ్యాఖ్య: డాక్టర్లను నమ్ముతున్నామన్న వెంకయ్య

జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు స్పందించారు. తాను కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మాట్లాడనని స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు స్పందించారు. తాను కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మాట్లాడనని స్పష్టం చేశారు.

ఆ నాలుగు.. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు: రిపోస్టుమార్టం?ఆ నాలుగు.. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు: రిపోస్టుమార్టం?

హైకోర్టు నోటీసులు ఇస్తే సమాధానం ఇస్తామన్నారు. జయలలిత మృతి విషయంలో తాము డాక్టర్లు చెప్పిన వివరాలను నమ్ముతున్నామని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు.

venkaiah naidu

కాగా, జయ మృతిపై మద్రాస్‌ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జయ మృతిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఈ రోజు విచారణ చేపట్టింది.

జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆమెకు సంబంధించి ఒక్క ఫొటో కూడా విడుదల చేయలేదని, ఏ సమయంలో మృతిచెందారన్న సమాచారం కూడా సరిగా వెల్లడించలేదని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌ పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చలేమన్నారు.

ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!

జయలలిత మృతిపై తనకూ అనుమానాలున్నాయని, అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. సీఎం ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంటుందని, దానిని ఎందుకు గుర్తించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఒక దశలో ఆయన జయలలిత దేహాన్ని సమాధి నుంచి తీసి ఎందుకు పరీక్షించరాదని అడిగారు.

English summary
Venkaiah Naidu responds on Jayalalithaa's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X