పెళ్లి కాకముందే: 'ఉపరాష్ట్రపతి'పై వెంకయ్య ఆసక్తికరం, టిడిపి నేతల బాధ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారయిందనే ప్రచారం నేపథ్యంలో పలువురు నేతలు పార్లమెంటు సాక్షిగా ఆయనకు అభినందనలు తెలిపారు.

మోడీ ముందు తేల్చేయనున్న వెంకయ్య: ఎన్టీఆర్‌కు అండగా... ఇదీ వెంకయ్య!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరీ, శరద్ పవార్, ఆనంద్ శర్మ, తెలుగు రాష్ట్రాల నేతలు టి సుబ్బిరామి రెడ్డి తదితరులు వెంకయ్యకు అభినందనలు తెలిపారు. ఆయన చిరునవ్వుతో వారిని పలకరించారు.

పెళ్లికాకముందే..: వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన పేరు వస్తుందని మీడియాలో వార్తలు రావడంపై వెంకయ్య స్పందించారు. పెళ్లి కాకముందే పుట్టబోయే బిడ్డకు పేర్లు పెడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

నాకు ఇష్టంలేదని..

నాకు ఇష్టంలేదని..

మిమ్మల్ని ఉప రాష్ట్రపతిగా చేయాలని భావిస్తున్నామని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం ఉదయం వెంకయ్య నాయుడుతో చెప్పారని తెలుస్తోంది. దానికి వెంకయ్య సుముఖత వ్యక్తం చేయలేదు.

Bihar poll defeat's concerns should be raised with in party says Venkaiah Naidu
వారికి ఇవ్వండి

వారికి ఇవ్వండి

తనకు క్రియాశీలక రాజకీయాల్లో నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేదని, కావాలంటే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావుకు లేదా తమిళనాడు ఎంపీ గణేశన్‌కు తదితరులకు ఎవరికైనా ఇవ్వాలని సూచించారని తెలుస్తోంది.

బాధగా ఉందని ఏపీ మంత్రులు

బాధగా ఉందని ఏపీ మంత్రులు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్తారన్న వార్తలు వింటే తమకు ఎంతో బాధగా ఉందని ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావులు అన్నారు. వెంకయ్య క్రియాశీలక రాజకీయాల్లో ఉంటేనే రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్నారు.

వెంకయ్య ఉంటేనే..

వెంకయ్య ఉంటేనే..

విభజన తర్వాత ఏర్పడిన సమస్యల పరిష్కారానికి వెంకయ్య ఎంతో చొరవ చూపారని మంత్రులు గంటా, పత్తిపాటి అన్నారు. రాష్ట్రాన్ని ఇంకా సమస్యలు పీడిస్తున్నాయని, వెంకయ్య వంటి వ్యక్తి సేవలు దూరమైతే సమస్యలు అలాగే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉంటేనే బాగుంటుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Venkaiah Naidu has unexpectedly emerged the top contender ahead of the BJP parliamentary board meeting to pick its vice-presidential candidate, according to newspaper report.
Please Wait while comments are loading...