సంక్రాంతి రద్దీ: రైల్వే బోర్డు ఛైర్మన్‌కు వెంకయ్య లేఖ, రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర మంత్రి వెంకయ్య స్పందించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు ఛైర్మన్‌కు గురువారం ఆయన లేఖ రాశారు.
దీంతో వెంకయ్య లేఖకు సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు ఛైర్మన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ్ వైపు వెళ్లే రైళ్లకు 35 అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ఆదేశించారు.
దీంతో గురువారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-కాకినాడ-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
గురువారం రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ, శుక్రవారం రాత్రి 10 గంటలకు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే పీఆర్ఓ చెప్పారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు మీదుగా వెళ్లనున్న ఈ రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆయన తెలిపారు.
Celebrating Bhogi... pic.twitter.com/jHLIXcc0Bo
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 14, 2016 May the blessings of the season fulfil your dreams... Wishing you a very happy Bhogi... pic.twitter.com/HPm4nWSoec
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 14, 2016 Instructed Sh A.K.Mittal, Railway Board Chairman to increase no of trains & to increase no of bogies in trains running in Telugu States(2/2)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 13, 2016 Saw the news reports about the hardships of People in the two Telugu States because of heavy Sankranti Rush.(1/2)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 13, 2016 











Click it and Unblock the Notifications