హైదరాబాద్ అందరి సొత్తు, భయపడ వద్దు : వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు అందరి సొత్తు అని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఓ అతుకుల బొంత అన్నారు. థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశం కుక్కలు చింపిన విస్తరి కావడం ఖాయమన్నారు.
ప్రస్తుతం దేశంలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం లేదన్నారు. దేశ చరిత్రలోనే ఈసారి కాంగ్రెసు రెండంకెల స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు పదవే తప్ప అధికారం మాత్రం లేదన్నారు. ప్రధాని జోక్యం చేసుకుంటే ఈ కుంభకోణాలు జరగకపోయి ఉండేవన్నారు.

ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటే ఈ కుంభకోణాలు జరిగి ఉండేవి కావన్నారు. ప్రముఖ సినీ నటులు స్వచ్చందంగా తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
కాగా, కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో తొలుత గద్వాల్ నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారు. ఇక చివరగా జడ్చర్ల చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు.












Click it and Unblock the Notifications