డైలాగ్ వార్: స్నేహితుల గొంతు లేచింది! 'పవన్ కళ్యాణ్‌పై వెటకారం కాదు'

అమరావతి: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌లకు గురువారం నాడు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రత్యేక హోదాపై వెంకయ్య యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తే, రాజధాని భూసేకరణ అంశంపై టిడిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు చెరిగారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి - టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ సమయం వచ్చినప్పుడు సమస్యల పైన ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. రాజధాని భూసేకరణ ప్రాంతంలో గతంలో పర్యటించిన.. పవన్ మరోసారి అందుకు సన్నద్ధమవుతున్నారు.

తాను త్వరలో బేతపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. రాజధాని భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక విధంగా తలనొప్పిగా మారారనే చెప్పవచ్చు. రైతులు ఇస్తే తీసుకోవచ్చని, బలవంతంగా మాత్రం సేకరించవద్దని పవన్ హెచ్చరిస్తున్నారు.

Venkaiah takes on Congress, Pawan Kalyan targets TDP

రాజధాని భూసేకరణ చట్టం పైన పవన్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. బలవంతంగా సేకరిస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని, అది ఎక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

రైతుల తరఫున పోరాడేందుకు తాను వారిని కలుస్తానని ట్విట్టర్ ద్వారా గురువారం వెల్లడించారు. మరోవైపు, ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమవుతోంది. ఈ రోజు కలెక్టర్‌కు భూసేకరణకు సంబంధించి కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని, ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ప్రకటన వస్తుందని చెప్పారు.

రేపటి నుండి లేదా ఆ తర్వాత భూసేకరణ చట్టం ప్రభుత్వం అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 30వేల ఎకరాలు సేకరించామని, మరో 3 వేల ఎకరాలకు రాద్దాంతం వద్దని ప్రభుత్వం చెబుతోంది.

బలవంతపు భూసేకరణ వద్దని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మరోవైపు, 98 శాతం భూసేకరణ పూర్తయిందని, ఇక రెండు శాతం భూసేకరణ పైన రాద్దాంతం చేయడం సరికాదని, రైతులకు సరైన ప్యాకేజీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

పవన్‌కు ఆగ్రహం తెప్పించిన యనమల వ్యాఖ్యలు

యనమల బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇందుకు ధీటుగా ఆయన ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను రైతుల తరఫున బాధ్యాతాయుతంగా మాట్లాడుతుంటే, యనమల వెటకారంగా మాట్లాడారని నిలదీశారు.

మంత్రుల వివరణ

పవన్ కౌంటర్ పైన టిడిపి నేతలు, మంత్రులు స్పందించారు. పవన్ కళ్యాణ్ అనవసర రాద్ధాంతం చేయవద్దని చెబుతూనే, ఆయన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన ఎవరూ వెటకారంగా మాట్లాడలేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

2200 ఎకరాల భూసేకరణకు తొలిదశలో తుళ్లూరు మండలంలో 700 ఎకరాల రైతులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. చంద్రబాబుకు పవన్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. టిడిపి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు అలా ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు నష్టం జరగనివ్వమని హామీ ఇచ్చారు.

కోర్టుకెక్కుతానని చెప్పిన ఎమ్మెల్యే

రాజధాని భూసేకరణ చట్టం తీసుకు వస్తే తాను కోర్టుకు వెళ్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి మానుకోవాలన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు వైసిపి సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రత్యేక హోదాపై వెంకయ్య

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి వెంకయ్య.. దాదాపు తొలిసారి యూపిఏపై ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ నుంచి ఏపీ కాంగ్రెస్ నేతల వరకు ఆయన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

వాళ్లు కెమెరాలు తీసేసి, డోర్లు మూసి అన్యాయంగా విభజన చేశారని, తాను తెలుగు రాష్ట్రాలకు న్యాయం కోసం పోరాడానని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ ఏడాదిలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో త్వరలో ప్రజల ముందుంచుతామన్నారు.

ప్రత్యేక హోదా పైన అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ఏడాదిలోనే అన్ని హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఏడాదిలో చేయాలంటున్న కాంగ్రెస్... అసలు యాభై ఏళ్లుగా ఏం చేసిందని గట్టి కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో హోదాపై ప్రశ్నించిన వారికి వెంకయ్య ఘాటైన సమాధానాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+