టీ కన్నుపొడిచాడు, మా పార్టీలో చేరండి: బాబుపై విహెచ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మండిపడ్డారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెప్పుకునే బాబు క్యాబినెట్ పదవిని ఏపీకి ఇచ్చి తెలంగాణ కన్ను పొడిచారని విమర్శించారు.

చంద్రబాబుకు ఏపీ అభివృద్ధే ముఖ్యమన్నారు. ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణలో టీడీపీ నాయకులకు భవిష్యత్తు లేదన్నారు. టీడీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరి తెరాస పైన పోరాడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా వీహెచ్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలున్న సుజనా చౌదరికి మంత్రి పదవిచ్చి, మోడీ నల్లధనంపై మాట్లాడే అర్హతను కోల్పోయారన్నారు.

VH blames Chandrababu Naidu

భూసేకరణే అడ్డంకి: అశోక్

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూసేకరణే అడ్డంకిగా మారిందని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వేరుగా అన్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలను పెట్టే వీలుందని, దాన్ని 12 విమానాల స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని భవిష్యత్‌లో పరిశీలనకు రావొచ్చన్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు పవన్‌హాన్స్‌ విభాగాన్ని కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ చేస్తామని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా చెప్పారు.

చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ఖరారు

చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

సీఎం వెంట మంత్రులు పీ నారాయణ, యనమల రామకృష్ణుడు, ఐఏఎస్‌ అధికారులు జెఎస్వీ ప్రసాద్‌, సాంబశివ రావు, గిరిధర్‌, టక్కర్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహర్ రావు వెళ్ల సింగపూర్‌లో జరిగే దక్షిణాసియా సదస్సులో చంద్రబాబు ప్రధాన అతిథిగా పాల్గొంటారు. పలు వాణిజ్య కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+