హత్యలు చేసినవాళ్లు కూడా..: జగన్ ర్యాలీపై విహెచ్

VHanumanth Rao
హైదరాబాద్: హత్యలు చేసినవాళ్లు కూడా భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలాగా ఊరేగింపులు తీసే ప్రమాదం ఉందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన రోజు జగన్ ఊరేగింపుగా వెళ్లడాన్ని ఆయన తప్పు పట్టారు. జగన్ ఊరేగింపును అనుమతించడాన్ని ఆయన వ్యతిరేకించారు. జగన్ ఊరేగింపుగా రావడం అవసరమా అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ జగన్ ర్యాలీ తీస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. ఎమ్మార్పియస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సమావేశం పెడతానంటే అనుమతి ఇవ్వరని, తెలంగాణ సమావేశాలకు అనుమతి ఇవ్వరని, కానీ జగన్ ర్యాలీకి మాత్రం అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు. జగన్ వల్ల ఆరు గంటలు నగరంలో ట్రాఫిక్ స్తంభించిందని ఆయన అన్నారు. జగన్‌కు రాష్ట్రం సహకరిస్తోందా, కేంద్రం సహకరిస్తోందా అని ఆయన అడిగారు. జగన్ ఊరేగింపును అనుమతించడం వల్ల ప్రజలు కూడా అవినీతికి అలవాటు పడిపోతారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనను పద్ధతిలో నడిపిస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మీడియాలో కనిపిస్తామనే ఉద్దేశంతో తెరాస నాయకులు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెరాస నాయకులు గానీ కెసిఆర్ కుటుంబ సభ్యులు గానీ ప్రజల్లోకి వెళ్లరని, ప్రజా సమస్యలు వారికి పట్టవని, తమకు ప్రచారం వస్తుందనే ఉద్దేశంతో వాళ్లు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులో కూర్చుని జై తెలంగాణ అని, ముఖ్యమంత్రిని తిట్టి టీవీల్లో కనిపిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+