Cheyutha Pensions: తెలంగాణలో పెన్షన్లపై కీలక అప్డేట్..! గడువు పొడిగింపు..!

తెలంగాణలో చేయూత పథకం (Cheyutha Pensions) కింద వృద్ధులు, ఇతర వర్గాల వారికి అందిస్తున్న పెన్షన్ల కోసం తాజాగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇందులో పలు చోట్ల సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించే గడువు పెంచాలని ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.

తెలంగాణ డీజీపీ విధ్వంసం.. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ బాదిన సీవీ ఆనంద్!
తెలంగాణ డీజీపీ విధ్వంసం.. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ బాదిన సీవీ ఆనంద్!

రాష్ట్రంలో కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన అర్హత మేరకు వీరికి పెన్షన్లు ఇచ్చేందుకు వీలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ్టితో ఇలా దరఖాస్తులు స్వీకరించే గడువు ముగిసింది. దీంతో ఈ గడువును సెప్టెంబర్ 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగించాలని ఉత్తర్వులు వచ్చాయి.

Cheyutha Pensions Telangana Government Extends Application Deadline
సర్‌పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు పొడిగింపుపై సీఈసీకి సీఎం రేవంత్ లేఖ
సర్‌పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు పొడిగింపుపై సీఈసీకి సీఎం రేవంత్ లేఖ

వాస్తవానికి ఈ నెల 9 నుంచి ఇలా చేయూత పెన్షన్ల కోసం కొత్త దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో అయితే బిల్ కలెక్టర్లు క్షేత్రస్దాయిలో పరిశీలన చేస్తారు. అనంతరం అర్హుల్ని ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అనంతరం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీంతో అర్హులైన లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+