అనంతపురంలో మరో లీల, ఏకంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో, ఆ నాయకులతో టచ్ లో?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద ఇప్పటికే వేటుపడింది. ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో స్వామిభక్తి ప్రదర్శించిన అధికారులకు ఇప్పటికే తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు విద్యాశాఖ అధికారుల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరిగిన సందర్బంగా తాడిపత్రిలో జరిగిన గొడవల దెబ్బకు మరోసారి ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు మోర్మోగిపోయింది. ఇప్పుడు అదే అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉప కులపతిగా పని చేస్తున్న రామకృష్ణారెడ్డి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన వాహనాలను రామకృష్ణారెడ్డి ఆయన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని వెలుగు చూసింది.

Vice Chancellor has been using the vehicles belonging to Srikrishna Devaraya University for his own needs

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన రిజిస్టార్, రెక్టార్ వాహనాలను కూడా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు తలిరడానికి రామకృష్ణారెడ్డి ఉపయోగించుకున్నారని వెలుగు చూసింది. అధికార పార్టీ నాయకులతో ఉన్న పరిచయాల వలన రామకృష్ణారెడ్డి ఆయన సొంత అవసరాలకు, కుటుంబ సభ్యులు విందులు, వినోదాలు, విహారయాత్రలకు వెళ్లడానికి ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

యూనివర్శిటీ వాహనాలను సొంత అవసరాలకు ఉపయోగించుకుంటే కిలోమీటరకు రూ. 6 చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నాయి. ఇలా రామకృష్ణారెడ్డి ఆయన సొంత అవసరాల కోసం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన వాహనాలు ఇంతకాలం వాడుకోవడంతో రామకృష్ణారెడ్డి రూ. 6. 17 లక్షలు చెల్లించాలని యూనివర్శిటీకి చెందిన కొందరు అధికారులు అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల అండదండలతో రామకృష్ణారెడ్డి ఇంత వరకు ఒక్క రూపాయికూడా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తుంది అని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఉపకులపతి రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అంటున్నారు ఆ యూనివర్శిటీకి చెందిన అకౌంట్స్ విభాగం ఉద్యోగులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+