వీడియో : నెల్లూరు జిల్లాలో దారుణం ; వేరే వ్యక్తితో వ్యభిచారం చెయ్యమని యువతిపై పైశాచిక దాడి

దేశంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఒకపక్క దేశవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న దాడులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా, మృగాళ్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతులపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై ఇష్టానుసారంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. వికృత చేష్టలకు దిగుతున్నారు. ఇక లైంగిక వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి.

యువతిని గొడ్డును బాదినట్లు బాదిన మానవ మృగం

యువతిని గొడ్డును బాదినట్లు బాదిన మానవ మృగం

తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక యువతిని విచక్షణారహితంగా గొడ్డును బాదినట్లు బాదుతూ, వీడియో తీసి మరీ పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి మహిళను మరో వ్యక్తితో వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంబంధించిన వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఓ యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులతో , కర్రతో ఇష్టారాజ్యంగా ఆమెను కొట్టాడు.

కొట్టొద్దని బతిమాలుతున్నా వదలకుండా దాడి

కొట్టొద్దని బతిమాలుతున్నా వదలకుండా దాడి

కొట్టవద్దని బ్రతిమిలాడుతున్నప్పటికీ ఆమెను కొడుతూ మరొక వ్యక్తితో వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. తన వల్ల కాదని బ్రతిమిలాడుతున్నా కనిపించకుండా దాదాపు కర్రతో పది దెబ్బలకు పైగా కొట్టాడు. ఒక చేత్తో ఆమెను కొడుతూ, దానిని వీడియో తీయించి మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువతి చేతి గాజులు పగిలి రక్తం కారుతున్నా, దెబ్బలకు తాళలేక యువతి రోదిస్తున్నా కనికరించకుండా మానవ మృగం యువతిని చిత్రహింసలకు గురిచేశాడు.

యువతిని బెదిరిస్తూ, కొడుతూ .. వీడియో తీయించి మరీ పైశాచికత్వం .. వీడియో వైరల్ , కేసు నమోదు

యువతిని బెదిరిస్తూ, కొడుతూ .. వీడియో తీయించి మరీ పైశాచికత్వం .. వీడియో వైరల్ , కేసు నమోదు

కర్రతో కొట్టకుండా అడ్డుకుంటే ఆమె ఒంటిపై బట్టలు చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి తన బట్టలు చించవద్దని ప్రాధేయపడింది. ఇక నేనేం చెప్పాను.. నువ్వేం చేసావు అంటూ యువతిపై ఇష్టారాజ్యంగా దాడి చేసిన వ్యక్తి వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి పై దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు మనుషులలో పెరుగుతున్న రాక్షస ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ, వారు దీనంగా రోదిస్తున్నప్పటికీ ఏమాత్రం చలించని మృగాళ్ల తీరు సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.

 మహిళల్లో ప్రతిఘటించే శక్తి పెరగాలి... ఇలాంటి ఘటనలను ఎవరైనా సరే అడ్డుకోవాలి

మహిళల్లో ప్రతిఘటించే శక్తి పెరగాలి... ఇలాంటి ఘటనలను ఎవరైనా సరే అడ్డుకోవాలి

మహిళల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా, పోలీసులు కేసు నమోదు చేసి ఎందరిని అరెస్టు చేసినా , ఇక కోర్టులో నిందితులకు శిక్షలు వేసినా సరే సమాజంలో పశు ప్రవృత్తి మారడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఇప్పుడు సమాజం ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తమ వంతు బాధ్యతగా ఇలాంటి ఘటనలు ఎక్కడ తారసపడినా కచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఇక మహిళలు కూడా దీనంగా రోదించడానికి బదులు జరుగుతున్న దాడిని గట్టిగా ప్రతిఘటించాలి. తమను అకారణంగా, అన్యాయంగా కొడుతున్న, హింసిస్తున్న వారి నుండి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+