శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పసుపు రంగు: విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు, బడ్జెట్‌లో నిధులివ్వకపోవడానికి కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమను ఎస్టీల్లో చేర్చాలని శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు విజయసాయి హాజరయ్యారు. అక్కడ ఉన్న పసుపు రంగు కరపత్రాన్ని చూసి ఆయన తీవ్రంగా స్పందించారు.

కాకతాళీయంగా ముద్రించబడిన పసుపురంగు కరపత్రాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాంప్లేట్ చూపిస్తూ.. దీని రంగు కూడా టీడీపీ కలరే అని, పేపర్ ఈ కలర్‌లో వేస్తే చంద్రబాబు మీకు ఏమైనా చేశారా అని వారిని నిలదీశారు.

బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్

పసుపు పచ్చ కలర్ పాంప్లెట్ పైన ఆగ్రహం

పసుపు పచ్చ కలర్ పాంప్లెట్ పైన ఆగ్రహం


మీకు తెలియకుండానే మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతన్నారని విజయసాయి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ తోలు తీస్తానని చెబుతుంటే, మీరు ఇలా పసుపు పచ్చ రంగు కరపత్రం వేసి, తోలు తీయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మీరు తోలు తీయించుకునేందుకు సిద్ధంగా ఉంటే ఎవరు సేవ్ చేయగలరని ప్రశ్నించారు.

ఏపీని విస్మరించడానికి బాబును నమ్మకపోవడానికే కారణం

ఏపీని విస్మరించడానికి బాబును నమ్మకపోవడానికే కారణం

కేంద్ర బడ్జెట్ పైన కూడా విజయ సాయి రెడ్డి స్పందించారు. రైతులు, సామాన్యులు, వ్యాపారులకు కేంద్ర బడ్జెట్ బాగుందని వ్యాఖ్యానించారు. 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకం అభినందనీయమన్నారు. అత్యంత ఖరీదైన వైద్య సేవలను పేద ప్రజల ముంగిటకు తీసుకు వచ్చే ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరారు. అదే సమయంలో రాష్ట్రాన్ని కేంద్రం విస్మరించిందని, సీఎం చంద్రబాబుపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు.

కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు

కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు

చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్లే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మన రాష్ట్రానికి మొండి చేయి చూపిందని, బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు లేవని, దుగ్గరాజుపట్నం నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదన్నారు. రాష్ట్ర దశ, దిశ మార్చే విశాఖ రైల్వే జోన్ ఊసు లేదన్నారు.

బాబుపై నమ్మకం లేకే నిధులు ఇవ్వలేదు

బాబుపై నమ్మకం లేకే నిధులు ఇవ్వలేదు

చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, ప్రాజెక్టులన్నీ అస్మదీయులకు కట్టబెడతారనే ఉద్దేశ్యంతోనేకేంద్రం మన రాష్ట్రానికి బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. హోదాపై తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఇస్తారంటే తాము అందుకు సిద్ధమని చెప్పారు.

English summary
YSR Congress Party MP Vijaya Sai Reddy praises Union budget on Saturday in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X