Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు తుమ్మిదే అద్భుతం, దగ్గితే అద్భుతం: రాధాకృష్ణకు విజయసాయి చురకలు

Recommended Video

    చంద్రబాబు తుమ్మిదే అద్భుతం,దగ్గితే అద్భుతం...!

    న్యూఢిల్లీ: తాను ఆంధ్రజ్యోతి పత్రికకు సబ్ స్క్రైబ్ చేసుకొని నెల రోజులు అవుతున్నా, పత్రిక ఇవ్వడం లేదని, ఎందుకివ్వడం లేదో తెలియదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సభ వాయిదాపడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికపై మాట్లాడారు. రాధాకృష్ణ దేహంలో మొత్తం టీడీపీ రక్తం పారుతోందన్నారు. అయితే జర్నలిస్ట్ లేదా పత్రిక అందరికీ సమదూరం పాటించాలనే విషయం గుర్తించాలన్నారు. రాధాకృష్ణతో తనకు స్నేహం ఉందని, కానీ తీరు సరికాదన్నారు.

    చంద్రబాబు అద్భుతంగా తుమ్మాడు, అద్భుతంగా దగ్గాడు

    చంద్రబాబు అద్భుతంగా తుమ్మాడు, అద్భుతంగా దగ్గాడు

    చంద్రబాబు తుమ్మితే అద్భుతంగా తుమ్మాడని, దగ్గితే ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ దగ్గరని పేర్కొంటారని, ఇదేనా మీరు చేసేది అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. మీకు జర్నలిజం విలువలు ఉంటే సమతూల్యం పాటించాలని రాధాకృష్ణకు చెబుతున్నానని తెలిపారు.

    అందరి చేతులు పట్టుకొని బతిమాలుతున్నారు

    అందరి చేతులు పట్టుకొని బతిమాలుతున్నారు

    పార్లమెంటులో అందరి చేతులు పట్టుకుని చంద్రబాబు బతిమిలాడుతున్నారని, ఆయనను ఎవరూ లెక్క చేయడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబును కలవాలంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారన్నారు. తనను జైలుకు పంపించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. ఏపీ మంత్రిగా ఉన్న లోకేష్‌కు హైదరాబాదులో ఏం పని అన్నారు. లోకేష్ జైలుకు వెళ్లడానికి పోలవరం, రాజధాని, భూస్కాం, తాత్కాలిక సచివాలయం, భూకేటాయింపులు, చంద్రబాబు విదేశీ పర్యటనలు, కాల్ మనీ సెక్స్ రాకెట్, హెరిటేజ్, అగ్రిగోల్డ్, ఓటుకు నోటు వంటి కేసులు చాలన్నారు.

    వైసీపీ ముందు ఎస్వీ రంగారావు కూడా సరిపోరు

    వైసీపీ ముందు ఎస్వీ రంగారావు కూడా సరిపోరు

    వైసీపీ నాయకుల నటన ముందు ఎస్వీ రంగారావు వంటి వారు కూడా సరిపోరని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వేరుగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు. విజయ సాయి రెడ్డి ఢిల్లీలో రాష్ట్రాన్ని, ప్రజలను తాకట్టుపెట్టారని, ప్రధాని మోడీ అండ చూసుకుని ఆయనకు పొగరు పెరిగిందన్నారు.

     కర్నాటకకు టీంలు పంపించే అవసరం లేదు బీజేపీని విమర్శిస్తే ఆ పార్టీ నేతలకంటే విజయ

    కర్నాటకకు టీంలు పంపించే అవసరం లేదు బీజేపీని విమర్శిస్తే ఆ పార్టీ నేతలకంటే విజయ

    సాయి రెడ్డి ఎక్కువ బాధపడుతున్నారని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అనేక ఆరోపణలు చేసి ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి తాము టీములను పంపామని కూడా కొందరు ఆరోపిస్తున్నారని, ఆ అవసరం తమకులేదన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+