చిట్టి నాయుడు శవాన్వేషణ యాత్రలకు బుచ్చన్న బ్రేక్ ; ఈ జక్కన్న చెక్కిన పప్పన్న శిల్పం ఇదే : సాయిరెడ్డి వ్యంగ్యం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నిత్యం సోషల్ మీడియా వేదికగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ సంస్థ నుండి చిరువ్యాపారులు, రోజువారీ కూలీలు నష్టపోయారని పేర్కొన్న విజయసాయిరెడ్డి గత టీడీపీ ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసిన అంటూ విరుచుకుపడ్డారు.

వెయ్యి కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ రిసార్ట్ పై పచ్చ బాబుల కన్ను

వెయ్యి కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ రిసార్ట్ పై పచ్చ బాబుల కన్ను

అగ్రిగోల్డ్ స్కాం కు కర్త-కర్మ-క్రియ గత టీడీపీ ప్రభుత్వం అని, బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వైయస్ జగన్ చెప్పారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాదు అగ్రిగోల్డ్ దివాలా పాపం బాబు నిప్పులు చెరిగారు సాయి రెడ్డి వెయ్యి కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ రిసార్ట్ పై పచ్చ బాబుల కన్ను పడిందని విమర్శలు గుప్పించారు. పాల ఫ్యాక్టరీ కూడా పెట్టడంతో హెరిటేజ్ పోటీ అవుతుందని భావించారని, ఎల్లో మీడియా ద్వారా పెట్టుబడిదారులలో సందేహాలు రేకెత్తించి మొత్తం లాక్కోవాలని స్కెచ్ వేశారని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

బుచ్చయ్య టైం చూసి కొట్టిన దెబ్బకు అందరికీ చెమటలు పట్టాయి

బుచ్చయ్య టైం చూసి కొట్టిన దెబ్బకు అందరికీ చెమటలు పట్టాయి


ఇదే సమయంలో నారా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి చిట్టి నాయుడు శవాన్వేషణ యాత్రలకు బుచ్చన్న ఉత్పత్తి రాజీనామా వార్తలు బ్రేకులు వేశాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా లైవ్ కవరేజీలతో మైలేజీ వచ్చిందని భ్రమ పడ్డాడని కానీ బుచ్చయ్య టైం చూసి కొట్టిన దెబ్బకు అందరికీ చెమటలు పట్టాయి అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. వెనక్కి తగ్గినట్టు అనిపించినా లోగుట్టు బయట పెట్టాడు బుచ్చన్న అంటూ సాయి రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉంటే కరోనాతో లక్షల ప్రాణాలు పోయేవి

చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉంటే కరోనాతో లక్షల ప్రాణాలు పోయేవి

రాష్ట్రంలో కరోనాను జగన్ సర్కార్ సమర్ధంగా ఎదుర్కొందని చెప్పారు. ఐదేళ్ల పాలనలో బాబు ఆసుపత్రుల్లో వసతుల కల్పన,108,104 అంబులెన్సుల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని వ్యాఖ్యానించారు . కరోనా అడుగుపెట్టిన తర్వాత జగన్ గారు కాకుండా ఆయనే ఉంటే, లక్షల ప్రాణాలు పోయేవని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనే సంసిద్ధతలో దేశంలోనే అగ్రస్థానంలో నిల్చింది రాష్ట్రం అంటూ జగన్ సర్కార్ కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

జక్కన్న చెక్కిన పప్పన్న శిల్పం ఇదే

జక్కన్న చెక్కిన పప్పన్న శిల్పం ఇదే

ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి చంద్రబాబు ఒక శిల్పం చెక్కుతున్నట్టు ఫోజులిచ్చిన ఫోటోను, నారా లోకేష్ ఫోటోను షేర్ చేసి ఈ శిల్పం ఆయన చెక్క లేదు. జస్ట్ ఫోటోకి ఫోజులు ఇచ్చాడు అంతే .. ఈ జక్కన్న చెక్కిన పప్పన్న శిల్పం ఇదే అంటూ లోకేష్, చంద్రబాబులపై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఇటీవల గుంటూరులో జరిగిన బీటెక్ విద్యార్థిని దారుణ హత్య విషయంలో జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ప్రశంసించారని ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును దేశం మొత్తం పరిగణలోకి తీసుకోవాలని అన్నారని విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రమ్య ఘటనలపై ప్రభుత్వ స్పందనకు నూటికి రెండు వందల మార్కులు ఇవ్వొచ్చు అంటూ అరుణ్ హల్దార్ చెప్పినట్లుగా విజయ్ సాయి రెడ్డి పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+