బాబు క్రియేషనే భ్రమరావతి, వారిని పరామర్శించి నాన్నారు ఎంత న్యాయం చేశారో చెప్పమన్న సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య హత్య కేసు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పక్షం నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ, లోకేష్ పరామర్శల పర్వంపై విరుచుకుపడుతోంది. రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని, ఎక్కడ శవం వుంటే అక్కడ రాబందులా వాలిపోతున్నాడని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

 ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కుటుంబాలను పరామర్శించి ఆ పని చెయ్ లోకేష్

ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కుటుంబాలను పరామర్శించి ఆ పని చెయ్ లోకేష్

తాజాగా మరోమారు లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఏడాది క్రితం హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళిన లోకేష్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో పనిలోపనిగా ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కుటుంబాలను కూడా పరామర్శించి మీ నాన్నారు ఎంత బాగా న్యాయం చేసారో నువ్వే చెప్పమ్మా అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కేసులలో వారికి న్యాయం జరగలేదని పెద్ద ఎత్తున టిడిపి సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయాన్ని సాయి రెడ్డి ప్రస్తావిస్తూ లోకేష్ ను టార్గెట్ చేశారు. వారి కుటుంబాలను కూడా వెళ్లి పరామర్శించాలని ఎటాక్ చేశారు.

చంద్రబాబు ఆర్ధిక సంస్థలను బెదిరిస్తున్నారు .. ఆయన నీచమైన ఎత్తులు అందుకే

చంద్రబాబు ఆర్ధిక సంస్థలను బెదిరిస్తున్నారు .. ఆయన నీచమైన ఎత్తులు అందుకే

ఇదే సమయంలో ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దంటూ ఆర్థిక సంస్థలను బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు కోవర్టుల ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తున్నాడు అంటూ విజయసాయిరెడ్డి ద్వజమెత్తారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు పింఛన్లు అందకూడదని నీచమైన ఎత్తులు వేస్తున్నాడని రేపు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తావు బాబు అంటూ చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. తీసుకునే అప్పుల ద్వారానే రాష్ట్ర ప్రజలకు పింఛన్లు ఇస్తున్నామని, ఇక వాటిని కూడా అందకుండా చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ షాకింగ్ ట్వీట్ చేశారు.

జగన్ పాదయాత్ర చేసిన రోడ్లపై పసుపు నీళ్ళు కుమ్మరించిన భ్రమరావతి

జగన్ పాదయాత్ర చేసిన రోడ్లపై పసుపు నీళ్ళు కుమ్మరించిన భ్రమరావతి

రాజధాని అమరావతిని భ్రమరావతి అంటూ చంద్రబాబు రాజధాని అమరావతికి అనవసరపు హైప్ క్రియేట్ చేశారంటూ విమర్శించారు. జగన్ గారు పాదయాత్ర చేసిన రోడ్లపై ట్యాంకర్లతో పసుపు నీళ్ళు కుమ్మరించిన భ్రమరావతి లో నివసిస్తే ఆయుష్షు పెరుగుతుందట .. ఆ రోజుల్లో పిట్టలదొర మాటలు అలా ఉండేవి అంటూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనను గుర్తు చేశారు. ఇదే సమయంలో ఆసియాలోనే అత్యంత నివాస యోగ్యం నగరాల జాబితాలో సింగపూర్ తప్ప ఎవరికీ చోటు దక్కలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక బాబు క్రియేషనే భ్రమరావతి అంటూ రాజధాని అమరావతి పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

కేంద్రానికి లేఖలు రాస్తున్న నీచుడు.. రఘురామ లక్ష్యం అదే

కేంద్రానికి లేఖలు రాస్తున్న నీచుడు.. రఘురామ లక్ష్యం అదే

ఇక సంక్షేమ అభివృద్ధిలో దూసుకెళ్తున్న జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే విపక్ష , ఒక స్వపక్ష ఎంపీ లక్ష్యమంటూ రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేశారు. రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు ఆపాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని అంటే ఆయన ఎంత నీచుడు అర్థం చేసుకోవచ్చు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. పేదోడి నోటి కాడ ముద్ద లాగేసే దుర్మార్గానికి కూడా వెనకాడటం లేదంటూ విజయ సాయి రెడ్డి రఘురామ కృష్ణంరాజు పై నిప్పులు చెరిగారు . రఘురామకృష్ణంరాజు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఇప్పటికే అనేకమార్లు విమర్శించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా నిత్యం రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+