పవన్ దెబ్బ, జగన్ కొత్తవ్యూహం: 'టీడీపీ నుంచి వైసీపీలోకి ఎమ్మెల్యేలు, కానీ షరతులు'

అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్‌లు అధికార టీడీపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి బీజేపీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ బీజేపీతో దోస్తీ తెంచుకోలేకపోతోంది.

Recommended Video

    YSRCP MLA Roja questions Pawan over JFC

     వైసీపీలోకి టీడీపీ నేతలు, విజయసాయి వ్యాఖ్య

    వైసీపీలోకి టీడీపీ నేతలు, విజయసాయి వ్యాఖ్య

    ఈ నేపథ్యంలో విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విజయ సాయి రెడ్డి చెప్పారు. టీడీపీ నుంచి కూడా కొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ రాజీనామా చేస్తేనే చేర్చుకుంచామని వారికి తాము చెబుతున్నామని వ్యాఖ్యానించారు.

     అవిశ్వాసం తర్వాత టీడీపీపై కొత్త వ్యూహం

    అవిశ్వాసం తర్వాత టీడీపీపై కొత్త వ్యూహం

    విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకమే కావొచ్చునని అంటున్నారు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే హోదా విషయంలో అవిశ్వాసంపై మల్లగుల్లాలు పడుతున్న టీడీపీని మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం లేదా అవిశ్వాసం విషయంలో పవన్ కళ్యాణ్ ప్రతి సవాల్ విసరడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. దీంతో దానిని పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు.

     పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్

    పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్

    అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ చెప్పడంతో జగన్ అందుకు సిద్ధమని సవాల్ విసిరారు. అయితే అందుకు తగ్గ ఎంపీలను పవన్ కూడగడతారా అని ప్రశ్నించారు. దానికి పవన్.. జగన్ సవాల్ స్వీకరిస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించారు. దీంతో వైసీపీ బుక్కయింది. ఈ నేపథ్యంలో దానిని పక్కదారి పట్టించేందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు.

     పవన్ ప్రతి సవాల్‌పై వైసీపీ వెనుకంజ

    పవన్ ప్రతి సవాల్‌పై వైసీపీ వెనుకంజ

    అవిశ్వాసం విషయంలో ఓ విధంగా పవన్ స్వీకరించిన ప్రతి సవాల్‌పై వైసీపీ వెనుకంజ వేసినట్లుగా కనిపించింది. మంగళవారం వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. జగన్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని పవన్ అనడం సరికాదని, ఎంపీల మద్దతును తామే కూడగట్టి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరోవైపు పవన్ తాను ఎంపీలను కూడగడతానని చెప్పారు. ఇలాంటి సమయంలో తామే ఎంపీలను కూడగట్టి అవిశ్వాసం పెడతామని భావిస్తామని చెప్పడంలోనే వారు వెనుకంజ వేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+