వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ పోలీసులపై ఫిర్యాదు: విజయసాయిరెడ్డి నోటీసు రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది జనవరిలో పోలీసులు దురుసుగా ప్రవర్తించి తమ హక్కులకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అప్పట్లో రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు.

టీడీపీకి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే షాక్, కారణం ఇదే! అధినేత డోంట్ కేర్!!టీడీపీకి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే షాక్, కారణం ఇదే! అధినేత డోంట్ కేర్!!

ఆ నోటీసును ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ కార్యాలయం నుంచి సమాచారం పంపారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Vijaya Sais privilege motion against Vizag police admitted,

హోదా పైనే తొలి సంతకం

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా దస్త్రం పైనే మొదటి సంతకం చేస్తామని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.

ఇటీవల ఏఐసీసీ సమావేశం, ఆత్మగౌరవ దీక్షలోను దీనిపై రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దోషులకు కఠిన శిక్షలు వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు.

అత్యాచార ఘటనల నమోదులో రాష్ట్రం ఆరో స్థానంలో ఉండటం ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి, బీమా అందించాలన్నారు.

English summary
A privilege motion moved by YSRCP Rajya Sabha member V. Vijaya Sai Reddy against the police “high-handedness” at the Visakhapatnam airport was referred to the Privilege Committee by the Chairman of the Upper House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X