బీజేపీకి ఇక మొసళ్ల పండగే.. ! తేల్చేసిన విజయసాయిరెడ్డి..!
పన్నెండేళ్లుగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి తాజాగా డీలిమిటేషన్-మహిళా బిల్లుల అమలు కోసం చేపట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో లోక్ సభలో భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఉభయసభల్లో 2/3 వంతు మెజార్టీ అవసరమని తేలిసినా, అది తమకు లేదని తెలిసినా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకెళ్లిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయరెడ్డి (Vijayasai Reddy) బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
131వ రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడంలో బీజేపీ విఫలమవడం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు విస్తృత జాతీయ ప్రయోజనాలకు కూడా దోహదపడే 'ఒకే దేశం, ఒకే ఎన్నిక', ఉమ్మడి పౌర స్మృతి' వంటి ఇతర ప్రధాన సంస్కరణలకు ముందున్న మార్గం కఠినంగా ఉంటుందని సూచిస్తోందని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. అంటే జమిలి ఎన్నికలతో పాటు ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాల అమల్లోనూ బీజేపీకి ఇవే కష్టాలు ఎదురుకాబోతున్నాయని చెప్పేశారు.

లోక్ సభలో ప్రస్తుతం 2/3 మెజార్టీకి బీజేపీ దాదాపు 66 సీట్ల దూరంలో ఉంది. ఈ లోటు ఇప్పట్లో భర్తీ అయ్యేది కాదు. అలాగని వైసీపీ వంటి పరోక్ష మిత్రపక్షాలు మద్దతిచ్చినా ఈ లోటు భర్తీ కాదు. రాజ్యసభలోనీూ దాదాపు ఇలాంటి పరిస్దితే ఉంది. అయితే రాజ్యసభలో సీట్లు పెంచుకునేందుకు బీజేపీకి రాబోయే సంవత్సరాల్లో అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును నెగ్గించుకోలేకపోతే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలు సాధారణంగానే జరిగిపోవడం ఖాయం. ఇందులో బీజేపీ గెలిచినా జమిలి ఎన్నికలు పెట్లాలంటే మరి కొన్నేళ్లు ఆగక తప్పదు. అందుకే విజయసాయిరెడ్డి డీలిమిటేషన్ వైఫల్యం బీజేపీకి రాబోయే రోజుల్లో కష్టాలు కలిగించడం ఖాయమని చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications