Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీకే మాటల్ని నమ్మొద్దన్న సాయిరెడ్డి..అసలు జరిగిందిదే..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో విజయంపై ఎవరికి వారే ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి తీరుతామంటూ వైసీపీ, ఈసారి ఎలాగైనా గెలుపు తమదేనంటూ టీడీపీ-జనసేన కూటమి ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్ధితి ఎలా ఉందన్న దానిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి తరుణంలో గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.

హైదరాబాద్ లో నిర్వహించిన ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ ఈసారి ఓడిపోతున్నారని, మామూలుగా కాదు భారీ తేడాతో ఓడిపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ ను ఉద్దేశించి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రశాంత్ కిషోర్ అంచనాలపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.

vijayasai reddy call not to rely on prashant kishor s gut after he said ys jagan loosing big

సాయిరెడ్డి ఎక్స్ లో పెట్టిన పోస్టులో ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడొద్దంటూ (నమ్మొద్దంటూ) సూచించారు. చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వర్త మాన రాజకీయాల్లో ఆయన అంచనాలకు, వాస్తవాలకూ పొంతన లేదన్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందికి అండగా నిలిచాయని, ఇవి ప్రజలకు భారీగా భద్రత నిచ్చాయని సాయిరెడ్డి గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+