Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ నేతల్ని నిలదీయండి-ఆ 34 చోట్ల ఓడించండి- ఉత్తరాంధ్ర ప్రజలకు సాయిరెడ్డి ట్వీట్

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేపు విశాఖలో వైసీపీ గర్జన నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీని నిలదీయాలని ఆయన సూచించారు.

మూడు రాజధానుల ఉద్యమం ముమ్మరం అవుతున్న వేళ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఏపీకి విశాఖ రాజధాని అవుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతల్ని ప్రశ్నించాలని ఉత్తరాంధ్ర వాసుల్ని సాయిరెడ్డి కోరారు. ఉత్తరాంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ ఆధారంగా టీడీపీకి ఇక్కడి 34 నియోజకవర్గాల ప్రజలు ఓటు వేయరాదని సాయిరెడ్డి సూచించారు. రేపు విశాఖ గర్జన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులకు సాయిరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

vijayasai reddy calls northern andhra people to corner and defeat tdp on vizag capital

ఇప్పటికే విశాఖ రాజధానికి అనుకూలంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఉత్తరాంధ్ర నుంచి సరైన స్పందన రావడం లేదని భావిస్తున్న అధికార పార్టీ రేపు వైజాగ్ లో గర్జన నిర్వహిస్తోంది. నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు రూపొందిస్తోంది. అలాగే అమరావతి పాదయాత్రగా వస్తున్న రైతుల్ని అడ్డుకుంటామనే ప్రకటనలు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా టీడీపీ నేతల్నినిలదీయండి అంటూ చేసిన ట్వీట్ తో రేపు ఉత్తరాంధ్రలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+