డీలిమిటేషన్ బిల్లు ఇలా నెగ్గించుకోండి-అమిత్ షాకు సాయిరెడ్డి 3 ఐడియాలు..!

దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్ల పెంపుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు వీలుగా కేంద్రం ఈ మధ్యే మహిళా బిల్లును తీసుకొచ్చింది. అయితే దీన్ని లోక్ సభలో మూడింటి రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో నెగ్గించుకలేకపోయింది. ఈ నేపథ్యంలో విపక్షాలపై ఎన్డీయే పార్టీలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కేంద్రం వద్ద ఈ బిల్లుల్ని ఇప్పట్లో నెగ్గించుకునే మార్గం కనిపించడం లేదు. అయినా త్వరలోనే మరోసారి ఈ బిల్లులు తెస్తామని కేంద్రం చెబుతోంది.

ఈ తరుణంలో డీలిమిటేషన్ బిల్లు ఎలా నెగ్గించుకోవాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సూచిస్తూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన తాను చెప్పిన మూడు సూత్రాలు అమలు చేస్తే ఈ బిల్లులు నెగ్గించుకోవడం కష్టమేమీ కాదని, వాటిని వ్యతిరేకించే ధైర్యం కూడా ఎవరికీ ఉండదని తేల్చిచెప్పేశారు. ఈ మేరకు హోం మంత్రి @అమిత్ షా కీలకమైన రక్షణలతో రాజ్యాంగ సవరణను తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు.

VijayaSai Reddy Calls on Amit Shah to Protect South India s Lok Sabha Share in Delimitation Bill

డీలిమిటేషన్ బిల్లు నెగ్గేందుకు విజయసాయిరెడ్డి చెప్పిన మూడు సూత్రాల్లో బిల్లులో రాష్ట్రాల వారీగా సీట్లలో 50% పెరుగుదలను చూపే ఒక లిఖితపూర్వక షెడ్యూల్ ఉాండాలన్నారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్‌తో రాజ్యసభ సీట్లను 50% విస్తరించడం, దీంతో పాటు 1971 నాటి ప్రామాణికం ప్రకారం దక్షిణ భారతదేశ లోక్‌సభ వాటాను కొనసాగించడం చేయాలని సూచించారు. ఈ మూడు పాయింట్లను అమలు చేయగలిగితే డీలిమేషన్ బిల్లు నెగ్గడం అసాధ్యం కాదని విజయసాయిరెడ్డి అమిత్ షాకు సూచించారు. వీటిపై అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+