జగన్ అరెస్టుపై జోస్యం..! క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో కూటమి సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ..రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారిని ఏకంగా జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్టు జగన్ దేనని ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో మాట్లాడుతూ అరెస్టు ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

లిక్కర్ స్కాంలో జగన్ జూన్ 10లోపు అరెస్టు కావచ్చని తిరుపతిలో, వైజాగ్ లో తన సన్నిహితులతో సాయిరెడ్డి చెప్పారంటూ వార్తలొచ్చాయి. దీనిపై రెండు రోజులుగా సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో స్పష్టత ఇచ్చారు. జగన్ కు వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ తాను ఎక్కడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. కోటరీ వల్ల, విభేదించి పార్టీ వదిలానే కానీ, జగన్ కు హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదన్నారు.

vijayasai reddy clarified to alleged comments on ys jagan arrest

తాను రాజకీయాల్లో లేనని, ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో తనకు శతృత్వం లేదని సాయిరెడ్డి తెలిపారు. తాను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతానన్నారు. లేదా తన అధికారిక 'ఎక్స్' ద్వారా తెలియజేస్తానన్నారు. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవన్నారు. తన పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాటపడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని విజయసాయిరెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+