చంద్రబాబు ఉస్కో అనగానే బానిసపార్టీల నేతల రచ్చ; ఆ టీడీపీనేతను ఉరి తియ్యాలన్న సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య లైంగిక వేధింపులతో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం దుమారం గా మారింది. టిడిపి నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపుల నేపథ్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇక ఈ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ జైన్ ను తెలుగుదేశం పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, వినోద్ జైన్ ను అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బానిస పార్టీల నేతలెవరూ14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు: విజయసాయి రెడ్డి
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దుర్ఘటన జరిగినా, బాలికలు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీపై ప్రస్తుతం వైసీపీ నేతలు టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి బాలిక ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు నాయుడిని, టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసేబానిస పార్టీల నేతలెవరూ14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరి తీయాలి : సాయి రెడ్డి ఫైర్,
పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపి నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే విజయవాడ భవానిపురం లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాలిక బలవన్మరణానికి పాల్పడటం బాధాకరమని వెల్లడించారు. బాలిక ఆత్మహత్య పై టిడిపి నేతలు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని ప్రశ్నించారు.ప్రతి చిన్నదాన్ని రాద్దాంతం చేసే టీడీపీ నేతలు దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్యపై వైసీపీ నేతలు మంత్రుల ఆగ్రహం, టీడీపీపై మండిపాటు
విజయవాడ తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిడిపి నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి సుచరిత సైతం పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు మైనర్ బాలికతో అత్యంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించకపోవడాన్ని హోం మంత్రి సుచరిత తీవ్రంగా తప్పుపట్టారు.
Recommended Video

చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇచ్చే ముందు నేతల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ తెరమీదకు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని వాసిరెడ్డి పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా జరిగిన తరువాత ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోతుందా అంటూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్ కు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications