వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును చూసి నవ్వుకుంటున్నారు: రాజ్యసభలో విజయసాయి నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రేషన్‌ దుకాణాల నిర్వీర్యానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని విజయసాయి రెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు.

పవన్ వల్ల నష్టమేమీ లేదు, టీడీపీ నేతలు రాబందుల్లా, ఏపీలో మాఫియా సామ్రాజ్యం: తేల్చి చెప్పిన జగన్పవన్ వల్ల నష్టమేమీ లేదు, టీడీపీ నేతలు రాబందుల్లా, ఏపీలో మాఫియా సామ్రాజ్యం: తేల్చి చెప్పిన జగన్

Recommended Video

Union Budget 2018 : బడ్జెట్ సూపర్, బాబుకు కౌంటర్

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను చంద్రబాబు ప్రైవేట్‌ మాల్స్‌గా మార్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో గుంటూరు-విజయవాడల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే సుమారు ఆరువేల రేషన్‌ షాపులను ఫ్యూచర్‌, రిలయన్స్‌ గ్రూపులకు కట్టబెట్టారని మండిపడ్డారు.

బాబు ఫ్యామిలివే..

బాబు ఫ్యామిలివే..

ఫ్యూచర్‌ గ్రూప్‌లో చంద్రబాబు కుటుంబానికి వాటాలున్నాయని, అందుకోసమే రేషన్‌ దుకాణాలను వారికి కట్టబెట్టారని విమర్శించారు. సొంత ప్రయోజనాలకోసం ప్రజా సంక్షేమ పథకాలను ప్రైవేటు పరం చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు.

ప్రేక్షక పాత్రేనా

ప్రేక్షక పాత్రేనా

దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రేషన్‌ షాపుల్లో 13రకాల సరుకులను ఇచ్చేవారని విజయ్సాయిరెడ్డి గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దీన్ని వ్యాపారంగా చేస్తోందని, పేద ప్రజల అవసరాలను గాలికి వదిలేసి డబ్బు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం చేతులెత్తేయడం, ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

బాబు సర్కారును చూసి నవ్వుకుంటున్నారు

బాబు సర్కారును చూసి నవ్వుకుంటున్నారు

కేంద్రంలో భాగస్వాములుగా ఉండి.. రాష్ట్ర అవసరాలపై కనీనస అవగాహన లేకుండా నాలుగేళ్లుగా కళ్లుమూసుకున్నారంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా, విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రం పట్టీపట్టనట్లుగా ఉంటే చంద్రబాబు సర్కార్‌ మొద్దు నిద్రపోతోందని ఆయన విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, బడ్జెట్‌ అయిపోయాక చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

బీసీల రిజవర్వేషన్లు ప్రైవేటు బిల్లు

బీసీల రిజవర్వేషన్లు ప్రైవేటు బిల్లు

బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఎంపీ విజయ్‌సాయి రెడ్డి రాజ్యసభలో ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా 55శాతం మంది బీసీలు ఉన్నారని, కానీ చట్టసభల్లో 20శాతం కూడా ప్రాతినిధ్యం దక్కట్లేదని ఆయన అన్నారు. ఇందుకోసమే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టామని విజయ్‌సాయి రెడ్డి అన్నారు. ఏపీలో 143 బీసీ కులాలున్నాయని, రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇప్పడున్న రిజర్వేషన్లు ప్రస్తుత జనాభాకు సరిపోవు కాబట్టే రిజర్వేషన్లు పెంచాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు. కాగా, రాజ్యసభలో రేషన్ షాపుల అంశంపై కేంద్రమంత్రి చౌదరి స్పందిస్తూ ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు అందడమే ముఖ్యమని ఆయన అన్నారు.

English summary
YSRCP MP Vijayasai Reddy on Friday lashed out Andhra Pradesh CM Chandrababu Naidu for malls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X