నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డి భేటీ
వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి , ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు.ఇంకా చెప్పాలంటే .. అసలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టాలని జగన్‌కు సలహా ఇచ్చిందే విజయసాయిరెడ్డి.వైసీపీ గెలుపోటముల్లో విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉన్నారు.పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే.
అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు బిగ్ షాకిచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆయన తన రాజ్యసభ పదవితో పాటు, పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని .. భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో చెప్పుకొచ్చారు.

చెప్పినట్టుగానే తన క్షేత్రంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దివంగత దమూరి హీరో తారకరాత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డికి బందువు అవుతారనే విషయం తెలిసిందే.
విజయ సాయిరెడ్డి ఈమెకు బాబాయి వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్యల ప్రేమ వివాహానికి ఇరువురి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో.. సాయిరెడ్డే మద్ధతు ఇచ్చినట్లు ఓ సందర్భంలో అలేఖ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న సాయిరెడ్డి ఇటీవల అలేఖ్య కుటుంబంతో కలిసి కాసేపు గడిపారు. ఆ ఫొటోను 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications