• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ - లిక్కర్ స్కాం సాక్ష్యాల ధ్వంసమే-ఈడీ అదుపుకు టీడీపీ డిమాండ్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సెల్ ఫోన్ మిస్సయిందంటూ తాడేపల్లి పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు కలకలం రేపుతోంది.అదీ హైసెక్యూరిటీ జోన్ అయిన తాడేపల్లిలో వీఐపీ అయిన సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆధారాల ధ్వంసమేనంటూ విపక్ష టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారంలో సాయిరెడ్డిని ఈడీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు.

వీవీఐపీ జోన్ తాడేపల్లి ప్యాలెస్ లో విజయసాయి ఫోన్ తస్కరించడం సాధ్యమయ్యేపనేనా అని టీడీపీ నేత బోండా ఉమ ఇవాళ ప్రశ్నించారు. వీరప్పన్ ఇంట్లో గంధపుచెక్కలు, తాడేపల్లి ప్యాలెస్ లో విజయ సాయిఫోన్ దొంగిలించడం అంతతేలికా? అని ప్రశ్నించారు. ఢిల్లీలిక్కర్ స్కామ్ లో తనపాత్ర బయట పడుతుందనే ఏ2 కొత్తనాటకానికి తెరలేపాడన్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రమేయమున్న విజయసాయిరెడ్డి అల్లుడు ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నాడని, లిక్కర్ స్కామ్ లోని నిందితులు ఇప్పటికే 140 ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొందని బోండా ఉమ గుర్తుచేశారు. స్కామ్ లో కీలకమైన వ్యక్తిగా చెప్తున్న శరత్ చంద్రారెడ్డి ఒక్కడే 30ఫోన్లు మార్చాడని ఈడీ చెబుతోందని, ఢిల్లీలోఉండి లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరైనప్పుడు, విజయ సాయిరెడ్డి మొబైల్ పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు, ఈడీ తనఅల్లుడిని విచారించినప్పుడు, ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో 140ఫోన్లు మార్చారని చెప్పినప్పుడు పోని విజయసాయి ఫోన్, తాడేపల్లి ప్యాలెస్ లో పోవడమేంటని అడిగారు.

vijayasai reddy phone missing-tdp ask ed to detain for destroying evidence in liquorscam

ఢిల్లీలో ఫోన్ పోయిందంటే ఈడీ అధికారులు ఎక్కడకుమ్ముతారోనన్న భయంతోనే ఏ2 తాడేపల్లి వచ్చి నాటకాలు మొదలెట్టాడని బోండా ఉమ విమర్శించారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలు రూపుమాపడానికి, ఈడీని తప్పుదోవపట్టించానికే ఈ నాటకమన్నారు. విజయసాయి ఫోన్ నిజంగానే పోయిందా..లేక ఆయన్నితన్ని జగన్ లాక్కున్నాడా? అని ప్రశ్నించారు. గతంలో అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఏ1,ఏ2లు చంచల్ గూడ జైల్లో ఉన్నారని, అలానే లిక్కర్ స్కామ్ లో మరలా తానెక్కడ తీహార్ జైలుకు పోవాల్సివస్తుందోనన్నభయంతోనే విజయసాయి నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నాడన్నారు. ఈడీ అధికారులు విజయసాయి వంటి క్రిమినల్స్ ను సాధారణ నేరస్తుల్లా ట్రీట్ చేయకూడదని, ఏపీలో సీఐడీ అధికారులు గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో వ్యవహరించిన మాదిరిగానే ఈడీ వ్యవహరిస్తేనే విజయసాయి ఫోన్ గంటలో బయటపడుతుందన్నారు. ఐఫోన్ ఎక్కడైనా పోతే, Find By Phone ఆప్షన్ ద్వారా అదిఎక్కడుందో ట్రాక్ చేయవచ్చని, అలాంటిది జేగ్యాంగ్ సాంకేతికతను, విచారణ సంస్థలను తప్పుదోవ పట్టించేలా అతితెలివితేటలు ప్రదర్శిస్తోందన్నారు. విచారణలో భాగంగా ఈడీ విజయసాయిరెడ్డి అల్లుడిని వీరబాదుడుబాది, అతన్నుంచి నిజాలురాబట్టగానే విజయసాయి ఫోన్ పోవడం నిజంగా గిమ్మిక్కేనన్నారు. అల్లుడిని పీకినట్టే, ఈడీఅధికారులు తనను ఎక్కడో పీకుతారోనన్న భయంతోనే మామ ఫోన్ పోగొట్టుకున్నాడనిపిస్తోందని బోండా ఉమ వ్యాఖ్యానించారు.

ఐపీసీ, సీఆర్ పీసీ చట్టాల ప్రకారం ఆధారాలు రూపుమాపడానికి ప్రయత్నించడం చాలా పెద్దనేరమని బోండా ఉమ తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రయత్నించానికి యత్నించిన విజయసాయిని తక్షణమే ఈడీ విచారిస్తేనే లిక్కర్ స్కామ్ బాగోతం బట్టబయలవుతుందన్నారు. లిక్కర్ స్కామ్ లోని సూత్రధారులు పాత్రధారులు, స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు, అదిదాచిన బంకర్ల సమాచారం, ఇతరత్రా వివరాలన్నీ విజయసాయి ఫోన్ లో ఉన్నాయన్నారు. దర్యాప్తుసంస్థలను ప్రభావితం చేయడంలో ఆరితేరిన ఏ2, కావాలనే ఫోన్ పేరుతో గేమ్ మొదలెట్టాడని బోండా ఉమ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈడీ గట్టిగాదృష్టి పెట్టాలని కోరారు. ఎందుకంటే ఏ1, ఏ2ల క్రిమినల్ మైండ్, మాస్టర్ ప్లాన్లకు గతంలో సీబీఐలాంటి విభాగమే నోరెళ్లబెట్టిందన్నారు. అంతతేలిగ్గా విజయసాయి బయటపడేరకం కాదు కాబట్టే, సీబీఐ గతంలో ఏ2ని పిచ్చకొట్టుడు కొట్టి నిజాలు రాబట్టిందని, విజయసాయితో బంధుత్వం కలుపుకున్నాకేకదా మెడిసిన్స్ తయారుచేసే అరబిందో సంస్థ లిక్కర్ అమ్ముకునే స్థితికి వచ్చిందన్నారు. లిక్కర్ స్కామ్ లో మూలస్తంభం విజయసాయిరెడ్డి కాబట్టే, తప్పించు కోవడానికి ఫోన్ పోయిందంటూ డ్రామాలు మొదలెట్టాడన్నారు. ఫోన్ తనజేబులో ఉంచుకొని పోయిందనిచెప్పినా తాడేపల్లి పోలీసులు విజయసాయి చెప్పినట్టే చేస్తారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించరని బొండా తెలిపారు.

English summary
tdp leader bonda uma on today demands ed to detain ysrcp mp vijayasai reddy who's cell phone is allegedly missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X