సీఎం చెప్పారని జనం వింటారా.? సాయిరెడ్డి చెప్పిన లాజిక్..!
ఏపీలో దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. ఆ లోపే తన అజెండాకు పదునుపెడుతున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ సీఎం చంద్రబాబు పిలుపునిస్తున్న ఓ విధానపరమైన నిర్ణయాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పిలుపునిచ్చినంత మాత్రాన క్షేత్రస్ధాయిలో ఇది వర్కవుట్ కాదని సాయిరెడ్డి తేల్చిచెప్పేస్తున్నారు.
రాష్ట్రంలో ముగ్గురు పిల్లలు కనే విధానాన్ని ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వయంగా సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగసభల్లో ప్రస్తావిస్తున్నారు. ముగ్గురు పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తల్లితండ్రులకు ఆశ చూపుతున్నారు. అయినా దీనిపై పెద్దగా స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలుపునిచ్చినంత మాత్రాన జనం ఎందుకు వినరో వివరిస్తూ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు.

#AndhraPradesh #CM Chandrababu Naidu @ncbn urging people to have more children when he himself has 1 child, and his son also has 1 child is ironical. People will not have more children simply because the CM asks them to. These decisions based on whether they can afford good…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2026
తనకే ఒక బిడ్డ, తన కొడుకుకు కూడా ఒక బిడ్డ ఉండగా, ప్రజలను ఎక్కువ మంది పిల్లలను కనమని కోరడం విడ్డూరంగా ఉందంటూ చంద్రబాబు పిలుపుపై సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం సీఎం అడిగినంత మాత్రాన ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనరని తేల్చిచెప్పారు. మంచి ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్యను భరించగలరా, తల్లిదండ్రులు పని, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలరా అనే దానిపై ఆధారపడి ఈ నిర్ణయాలు ఉంటాయన్నారు. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును తిప్పికొట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దానికి సమాధానం విజ్ఞప్తి చేయడం కాదు, పిల్లలను పెంచడాన్ని సులభతరం , మరింత సరసమైనదిగా మార్చడమే అని సాయిరెడ్డి సలహా ఇచ్చారు.














Click it and Unblock the Notifications
