YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పేసిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన వైసీపీ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రేపు ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇందులో పలు ప్రజాకర్షక హామీలు ఉండబోతున్నాయి. అయితే వీటిపై వైసీపీ పూర్తిగా మౌనం వహిస్తోంది. వీటిని ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేపు వైసీపీ విడుదల చేయబోతున్న ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షన్ల పెంపు, డ్వాక్రా రుణమాఫీ సహా పలు హామీలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉండబోతోందో విజయసాయిరెడ్డి ఒక్క ముక్కలో తేల్చిచెప్పేశారు. గతంలో తాము ఇచ్చిన మ్యానిఫస్టోతో పాటు టీడీపీ మ్యానిఫెస్టోనూ దీంతో ఆయన పోల్చారు.

vijayasai reddy reveals how ysrcp poll manifesto will be

న్నికల తర్వాత తమ మేనిఫెస్టోలను చెత్తబుట్టలో పడేసే టీడీపీ లాగా వైసీపీ మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కు కాదని విజయసాయిరెడ్డి ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపారు. వైసీపీ మ్యానిఫెస్టో తమ నిబద్ధత అని, తమ హామీ అని తెలిపారు. ఏపీ ప్రజల కోసం తమ ముందున్న కర్తవ్యమన్నారు. అలాగే తాము ఏం వాగ్దానం చేస్తున్నామో అదే ఇస్తామని కూడా సాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. అయితే ఎన్నికల హామీల్ని మాత్రం ఆయన లీక్ చేయలేదు.

vijayasai reddy reveals how ysrcp poll manifesto will be
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+