సన్నిహితుడ్ని అడ్డుపెట్టి జగన్ టార్గెట్ ..! కూటమినీ లాగి-సాయిరెడ్డి బిగ్ ప్లాన్.!
ఏపీలో దసరాకు కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. ఆ దిశగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెరముందు కూడా వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అదీ మతాన్ని బూచిగా చూపి. గతంలో జగన్ సీఎంగా ఉండగా ఆయన సన్నిహిత ఎమ్మెల్యే ఒకరు.. 2024 ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యల వీడియోను బయటపెట్టిన సాయిరెడ్డి.. వైసీపీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా దీనిపై స్పందించాలంటూ ఎన్డీయే సహా ఇతర పార్టీల్నీ కోరుతున్నారు.
వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు-భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీలు తమ స్టాండ్ స్పష్టం చేయాలని కోరుతున్నా అంటూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను సాయిరెడ్డి షేర్ చేశారు. జగన్ కు సన్నిహితుడిగా, వ్యాపార భాగస్వామిగా కూడా పేరున్న ద్వారంపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసినవే అని అర్దమవుతోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు–భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీలు తమ స్టాండ్ స్పష్టం చేయాలని కోరుతున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2026
అంతేకాకుండా, గతంలో… pic.twitter.com/VdIy0KQ5fq
ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 140 రోజుల తర్వాత ఓ క్రైస్తవుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని క్రైస్తవ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాక ముందు ఎమ్మెల్యేలకు లంచాలు ఇస్తే తప్ప క్రైస్తవులు సభలు పెట్టుకునే పరిస్ధితి ఉండేది కాదని, భవిష్యత్తులో ఇలాంటి సభలు పెట్టుకోవాలన్నా, మన దేవుడిని ప్రార్ధించుకోవాలన్నా క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ సాయిరెడ్డి.. గతంలో ఎంతమంది నాయకులు తమ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం- జగన్‌గారిని ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో- ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్‌లో నంబర్ వన్ ఎవరైతే వారు సమాధానం చెప్పాలని కోరారు.














Click it and Unblock the Notifications
