వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫూల్స్ దగ్గరే ఫూల్ అయ్యేలా ఉన్న లోకేష్; వీడియో పోస్ట్ చేసిమరీ సాయిరెడ్డి వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ ఫస్ట్ ఈ సందర్భంగా కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగింది. జనం చెవిలో జగన్ పూలు పెట్టాడని, ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని లోకేష్ నాడు జగన్ మాట్లాడిన వీడియోలను, ప్రస్తుతం జగన్ మాట్లాడిన వీడియో లతో కలిపి ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్స్ ని చేశారంటూ లోకేష్ ధ్వజమెత్తారు.

జగన్ ప్రజలను అనేక విషయాలలో మోసం చేశారని పేర్కొన్న లోకేష్ వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా జనం చెవిలో జగన్ పూలు ఏప్రిల్ 1 విడుదల అంటూ వీడియోను పోస్ట్ చేయగా ఇక లోకేష్ నేను మూర్ఖుడిని అంటూ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లోకేష్ ను టార్గెట్ చేశారు. ఏ చిన్న అవకాశం దొరికినా లోకేష్ ను వదిలిపెట్టకుండా టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి, చిట్టి నాయుడు, పప్పు నాయుడు అంటూ నిత్యం సెటైర్లు వేస్తున్నారు.

 Vijayasai reddy said april fools day wishes to lokesh and said lokesh is a fool

ఇక తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి నారా లోకేశ్ మూర్ఖుడంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి లోకేష్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి ఈ విషయం లోకానికెప్పుడో తెలుసు లోకేశం- అసలు మూర్ఖత్వానికి ప్యాంటూ షర్టు వేస్తే అది నువ్వే అని ఎద్దేవా చేశారు. ఫూల్స్ దగ్గరే ఫూల్ అయ్యేలా ఉన్న నీకు ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు అని విజయసాయిరెడ్డి లోకేష్ కు ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ ని టార్గెట్ చేసి లోకేష్ ఏప్రిల్ ఫూల్ వీడియో పోస్ట్ చేస్తే, లోకేష్ మూర్ఖుడు అంటూ విజయ సాయి రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

English summary
Vijayasai Reddy slams Lokesh who is supposed to be a fool near fools. Saireddy wishing lokesh a April Fools' Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X