• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సొల్లు వాగితే ఎలా పప్పూ .. మోడీని చీమలా కాలికింద నలిపేస్తానన్న బాబు ఫార్ములా చెప్పిన సాయిరెడ్డి

|

టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోమారు విరుచుకుపడ్డారు. నిత్యం చంద్రబాబును, లోకేష్ ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు.

నాలుక్కి కొవ్వుపట్టి దురదపెడుతుందని సొల్లు వాగుతావా ?

నాలుక్కి కొవ్వుపట్టి దురదపెడుతుందని సొల్లు వాగుతావా ?

రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న హత్యలపై టీడీపీ నేతలు వైసీపీ నేతలు హత్యలు చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు .వీటిపై విజయ సాయి రెడ్డి ఎక్కడో ఏదో జరుగుతోంది . పాత కక్షలు కావచ్చు. .. ఆస్తి గొడవలు అయి ఉండొచ్చు . క్షణికావేశంలో నేరానికి పాల్పడి ఉండొచ్చు. నాలుక్కి కొవ్వుపట్టి దురదపెడుతుందని ఉద్దేశాలు అంటగడుతూ సొల్లు వాగితే ఎలా పప్పూ అంటూ నారా లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శించారు.

రాహుల్ గాంధీ పుట్టిన రోజు వస్తే శుభాకాంక్షలు కూడా చెప్పే ధైర్యం లేని దద్దమ్మలా

రాహుల్ గాంధీ పుట్టిన రోజు వస్తే శుభాకాంక్షలు కూడా చెప్పే ధైర్యం లేని దద్దమ్మలా

ఇదే సమయంలో మనిషివి పెరిగినా జ్ఞానం వికసించలేదని ఏదైనా నోరు తెరిచే ముందు మీ నాయన్ని అడుగు అంటూ లోకేష్ కు హితవు పలికారు. అలాగే చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి రెండేళ్లక్రితం వందల కోట్ల ఎలక్షన్ ఫండింగ్ చేశావు .మోడీ గారిని చీమలా కాలికింద నలిపేస్తా అని బీరాలు పలికావు అంటూ టిడిపి అధినేత ను టార్గెట్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వస్తే కనీసం జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పే ధైర్యం లేని దద్దమ్మలా మిగిలావేంటి బాబు అంటూ విమర్శించారు.

నాకెంత నీకెంత ఫార్ములా చంద్రబాబుది

నాకెంత నీకెంత ఫార్ములా చంద్రబాబుది

అవకాశవాదానికి రూపం ఉంటే అది ముమ్మాటికీ నువ్వే అంటూ చంద్రబాబు పై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.అంతకుముందు సోషల్ మీడియాలో అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ ఆక్షన్ లు, టెండర్లు, ఎంవోయూ అనే పదాలకు మీ పార్టనర్ బాబు డెఫినేషన్ లేకుండా చేశాడని, ఏది అమ్మినా నాకెంత నీకెంత ఫార్ములా తప్ప ఇంకేం ఉండదని, మధ్యలో అహ్మదాబాద్ కంపెనీ ఆక్షన్ టైగర్ ఎలా వచ్చిందని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు.

మాన్సాస్ ట్రస్ట్ లో బాబు మనుషులు .. అంతా తెలుసు

మాన్సాస్ ట్రస్ట్ లో బాబు మనుషులు .. అంతా తెలుసు

వేలం లో ఎవరు పాల్గొంటారు? చివరకు ఎవరికి దక్కుతుందో ముందే డిసైడ్ అవ్వటం ఎవరికి తెలియదు అశోక్ అంటూ పంచ గ్రామాల భూముల వ్యవహారంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. పంచ గ్రామాల సెటిల్మెంట్ ను అడ్డుకున్నది ఎవరో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు .నువ్వు చెప్పే కథలు నోట్లో వేలు పెట్టుకున్న పసివాడు కూడా నమ్మడు.

మాన్సాస్ ట్రస్టులో బాబు మనుషులు చేరినప్పుడే ఏం జరగబోతుందో అందరికీ అర్థమైంది.అమాయకుడిలా ఫోజులు ఎందుకు అశోక్ అంటూ అశోక్ గజపతిరాజు ను సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు చంద్రబాబును, ఇటు నారా లోకేష్ ను, అశోక్ గజపతిరాజును ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు విజయసాయిరెడ్డి.

English summary
YCP Rajya Sabha member Vijayasai Reddy is setting fire to TDP chief Chandrababu Naidu and Nara Lokesh. chandrababu is a defination of opportunism, and vijayasai questioned lokesh about his comments and slams lokesh over recent murders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X