Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrababu విశాఖ రాజధానిని వ్యతిరేకించింది అందుకే .. రీజన్ చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు విశాఖను రాజధానిగా వ్యతిరేకించడానికి గల కారణాన్ని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భూ ఆక్రమణలు బయటపడతాయని బాబు విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

కుంభకోణాలు బయట పడతాయనే బాబు భయం

కుంభకోణాలు బయట పడతాయనే బాబు భయం

తన బంధువు కు చెందిన గీతం ,పల్లా, చిన్న పెద్ద నాయకులంతా వేల కోట్ల విలువైన భూములను చెరబట్టారుఅంటూ నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి, విశాఖ రాజధాని అయితే అధికార పీఠం అక్కడే ఉండి కుంభకోణాలను వెలికి తీస్తుందని చంద్రబాబు భయపడ్డాడు అంటూ బాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించడానికి కారణం ఇదేనని పేర్కొన్నారు.ఇదే సమయంలో చంద్రబాబు కొత్త ఉచ్చులో ఎవరూ పడకండి అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, చంద్రబాబునాయుడు స్వభావాన్ని వెల్లడించారు.

 గత ఎన్నికల్లో వ్యూహకర్త దొరికితే వెయ్యి కోట్లైనా వెదజల్లేవాడు

గత ఎన్నికల్లో వ్యూహకర్త దొరికితే వెయ్యి కోట్లైనా వెదజల్లేవాడు

చంద్రబాబు నాయుడు తన కోసం పనిచేసే వ్యక్తులను విభజించి పాలించడానికి ప్రయత్నిస్తారని, అతనితో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసునని పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రజలను విభజించడం, దోపిడీ చేయడం వంటి తన స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోలేడని, సైలెంట్ గా ఉండలేడని పేర్కొన్నారు.ఇదే సమయంలో కిందటి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని చంద్రబాబుకి తెలిసిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి, విజయం సాధించే మార్గం చూపించే వ్యక్తి వారికి ఎవరైనా దొరికితే వెయ్యి కోట్లు అయినా వెదజల్లే వాడంటూ పేర్కొన్నారు.

Recommended Video

    Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
    ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబుని ఏకిపారేస్తున్న సాయిరెడ్డి

    ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబుని ఏకిపారేస్తున్న సాయిరెడ్డి

    అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లోనే ఐదు లక్షల కోట్లు వస్తాయని చంద్రబాబు ఆశించాడు అని, ఈ కథలన్నీ తెలిసి వ్యూహకర్తగా సేవలందించడానికి ఎవరు అంగీకరిస్తారు అంటూ చంద్రబాబుకు వ్యూహకర్తగా పనిచేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబుని ఏకిపారేయటం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి అలవాటుగా మారిపోయింది. అందులో భాగంగానే ప్రతిరోజూ తెలుగుదేశం పార్టీ నేతలు,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు రివర్స్ కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు పై నిప్పులు చెరుగుతున్నారు విజయసాయి రెడ్డి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+