హిట్లర్ కూడా నీలానే.. చంద్రం అన్నయ్యా ఇదేం ఖర్మ: ఎంత మాట అనేశాడు సాయిరెడ్డి!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడుపై, తమకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాస్తున్న పలు పత్రికల అధినేతల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలపై, టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నారంటూ పలు పత్రికల పై మండిపడుతున్న విజయసాయిరెడ్డి తాజాగా మరోమారు చంద్రబాబు నాయుడుని, ఓ పత్రికా అధినేతను, రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేశారు.
చంద్రం అన్నయ్య ను చూసి ప్రజలు ఇదేం ఖర్మ అంటున్నారు: సాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదేం ఖర్మ అంటూ వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ప్రారంభించిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టకుండా విమర్శించారు. పప్పు నాయుడు ఎందుకూ పనికిరాడు దీంతో "ఇదేం ఖర్మ" అనుకుంటున్నాడు మా అన్నయ్య చంద్రం అంటూ సెటైర్లు వేశారు. మా అన్నయ్యను చూసి ప్రజలు "ఇదేం ఖర్మ" అంటున్నారని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. బాబు దెబ్బకు 23కే పరిమితమయ్యామనీ- 2024 తర్వాత జీరోనే..."ఇదే ఖర్మ అంటే" అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుకు చురకలంటించారు.
హిట్లర్ కూడా నీలానే కలలుకన్నాడు చంద్రం అన్నయ్య: సాయి రెడ్డి
చక్రవర్తులు అనుకున్న మహా మహులెవరూ జీవితకాలం పాలించలేదు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి నువ్వెంత అంటూ చంద్రబాబుపై పడ్డారు. హిట్లర్ కూడా నీలాగే కలలు కన్నాడు చంద్రం అన్నయ్యా అంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అహంతో అందరినీ వేధించావు. కాళ్ళు పట్టుకుని, కుట్రలు చేసి జైళ్లకు పంపావు. నీ పుస్తకంలోని ప్రతి అక్షరం ప్రజలకు కంఠస్తమే. ఆశలేం పెట్టుకోకు అంటూ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడని, కానీ చంద్రబాబు ఆశలు ఫలించే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రఘురామకృష్ణంరాజు పైన సాయి రెడ్డి విమర్శలు
అంతేకాదు తన పైన రఘురామకృష్ణంరాజు రాసిన లేఖపై కూడా సాయి రెడ్డి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమాల్లో దిగజారిన భారత్ ను ఉపయోగిస్తూ పెద్దల సభ అవునా త్యాన్ని దెబ్బతీస్తున్నారని, సాయి రెడ్డి ని స్థాయి సంఘం చైర్మన్ పదవి నుంచి తప్పించాలని రఘురామకృష్ణంరాజు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో విజయ సాయి రెడ్డి రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేశారు.

చంద్రానికి పెద్ద పాలేరు విగ్గు రాజు.. నీకెందుకు ఇవన్నీ అంటూ సెటైర్లు
పెద్ద పాలేరు విగ్గురాజుకు స్క్రిప్టు పంపించాడు చంద్రం అంటూ ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందని మండిపడ్డారు. దిగజారుడు భాషకు పేటెంటు పచ్చ పార్టీ , నీలాంటి బంట్రోతులదే కదా పెగ్గు రాజు? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హతపై విచారణ, వందల కోట్లకు బ్యాంకులను ముంచిన కేసులు ఎదుర్కొంటున్న వాడివి. నా గురించి ఫిర్యాదు చేస్తావా? పెగ్గుతాగి పడుకోక నీకెందుకు ఇవన్నీ? అంటూ విజయసాయిరెడ్డి రఘురామ కృష్ణం రాజుకు చురకలు అంటించారు.

నువ్వు మామూలోడివి కాదు డ్రామోజీ.. టార్గెట్ చేసిన సాయి రెడ్డి
అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఓ పత్రిక యజమాని ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నువ్వు మామూలోడివి కావు డ్రామోజీ! అంటూ నిప్పులు చెరిగారు. ప్రసాదం అని నమ్మించి పచ్చి విషాన్ని మార్కెట్ చేయగల మోసగాడివి అని మండిపడ్డారు. ఎక్స్పైర్ అయిన పది టన్నుల ప్రియమైన పచ్చళ్ళ ప్యాకెట్లకు కొత్త లేబుల్స్ అంటించి డిస్కౌంట్ పేరుతో పేపర్ ఏజెంట్ల ద్వారా అమ్మావట! అప్పటి ప్యాకింగ్ సెక్షన్ ఉద్యోగులు ఇప్పటికీ చెప్పుకుంటారు అంటూ టార్గెట్ చేశారు












Click it and Unblock the Notifications