• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ; మూల్యం చెల్లిస్తున్నారుగా బాబూ: సాయిరెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు. టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టుపై చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతల విమర్శలకు సమాధానం ఇచ్చారు. లోకేష్ పై పప్పూ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీకి అన్యాయం చేసిన కుట్రలో చంద్రబాబు ప్రధాన సూత్రధారి: విజయసాయి రెడ్డిఏపీకి అన్యాయం చేసిన కుట్రలో చంద్రబాబు ప్రధాన సూత్రధారి: విజయసాయి రెడ్డి

నారా వారి సిఆర్పిసిలో రాత్రిపూట అరెస్టులు చేయొద్దని ఏమైనా ఉందా?

శుక్రవారంనాడు లోకేష్ మూర్ఖుడు రాజ్యమైతే వ్యవస్థలన్నీ చెరబడతాడు అని చెప్పడానికి వైయస్ జగన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎదురు దాడి చేశారు. మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ అంటూ లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చినా కాపాడటం మీ తప్పుకాదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘం లీడర్ గా లేపి ప్యాకేజిలిచ్చి, చివరకు ఎమ్మెల్సీని చేశారు అంటూ ఎద్దేవా చేశారు. నారా వారి సిఆర్పిసిలో రాత్రిపూట అరెస్టులు చేయొద్దని ఏమైనా ఉందా? అని సెటైర్లు వేశారు.

మూల్యం చెల్లిస్తారంటూ చంద్రబాబు చిందులు

అంతే కాదు తాను బి.కామ్ చదవలేదని స్వయంగా అశోక్‌బాబేచెప్పారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. సర్టిఫికెట్‌ను టాంపర్‌ చేసి ఏసిటిఓగా అశోక్ బాబు ప్రమోషన్ కొట్టేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేస్తే దీనికి మూల్యం చెల్లిస్తారంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నారు అంటూ మండిపడ్డారు. టిడిపి నేతలు వైసిపి మూల్యం చెల్లించక తప్పదు అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా మీ తప్పులకు ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నారుగా బాబూ! అంటూ విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు

 ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ రగడ

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ రగడ

ఇదిలా ఉంటే టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును ఫేక్ సర్టిఫికెట్ పెట్టి పదోన్నతి పొందారు అన్న అభియోగంతో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశోక్ బాబు బెయిల్ పై బయటకు వచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ కోసం పోరాటం చేసిన అశోక్ బాబుపై కక్షపూరితంగా వైసిపి అక్రమ కేసులు బనాయించిందని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు జగన్ అరాచకాలను ప్రశ్నించినందుకే అశోక్ బాబును అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు.

Recommended Video

Telangana : నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ మోసం చేసాడు..కాంగ్రెస్ మౌన దీక్ష | Oneindia Telugu
 మండిపడిన లోకేష్ .. పప్పు అంటూ టార్గెట్ చేసిన సాయిరెడ్డి

మండిపడిన లోకేష్ .. పప్పు అంటూ టార్గెట్ చేసిన సాయిరెడ్డి

ఇక లోకేష్ అయితే సిఐడి ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకొని వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు అంటూ మండిపడ్డారు. స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ ని గుడ్డిగా అమలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని విమర్శించారు. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చెయ్యమని నిలదీయడం ఆయన చేసిన తప్పా? పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరపున పోరాడటం నేరమా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. లోకేష్ ను టార్గెట్ చేసి పప్పు అని సంభోదిస్తూ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి.

English summary
YCP MP Vijayasai Reddy has lashed out at TDP chief Chandrababu and Lokesh. He countered the comments made by Chandrababu and Lokesh on the arrest of TDP MLC Ashok Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X