• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాకోనియన్ లాను రుద్దుతున్నదెవరు.. నీచ కుట్రకు సాక్ష్యమిదే : ఆ వీడియోతో చంద్రబాబుకు విజయసాయి షాక్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడుపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. యనమల సీఎం జగన్మోహన్ రెడ్డిని క్రూరుడైన డ్రాకో రాజుతో పోల్చడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలిసీ తెలియని నకిలీ మేధావి అంటూ నిప్పులు చెరిగారు విజయ సాయి రెడ్డి. ఇక చంద్రబాబు మాట్లాడిన ఒక వీడియో పోస్ట్ చేసి నీచ కుట్ర బట్టబయలు అయ్యిందని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు .

బాబు 'రాడార్'కు ఆ డేటా అందలేదా ..కాగ్ వాతలు మీకు నొప్పెట్టవు, ఈ రహస్యమైనా : విజయసాయి వ్యంగ్యంబాబు 'రాడార్'కు ఆ డేటా అందలేదా ..కాగ్ వాతలు మీకు నొప్పెట్టవు, ఈ రహస్యమైనా : విజయసాయి వ్యంగ్యం

తెలిసీ తెలియని నకిలీ మేధావి యనమల

తెలిసీ తెలియని నకిలీ మేధావి యనమల

జగన్ ఢిల్లీ పర్యటన చూసి టీడీపీకి మెంటల్ ఎక్కిందని, తెలిసీ తెలియని నకిలీ మేధావి యనమల మాటలు చూస్తే అర్థమవుతుందని యనమలను టార్గెట్ చేసి ట్వీట్ చేశారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఏడ్చే జీవులకు జీవితాంతం ఏడుపే మిగులుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు విజయసాయిరెడ్డి. అంతేకాదు చిత్తుగా ఓడిపోయి కూడా వ్యవస్థను అడ్డంపెట్టుకుని దొంగచాటుగా డ్రాకోనియన్ లా ను రుద్దుతున్నదెవరు యనమల గారు అంటూ మండిపడ్డారు.

 ఏది చెయ్యాలన్నా అడ్డుకుంటున్నది ఎవరు ? మీరు కాదా

ఏది చెయ్యాలన్నా అడ్డుకుంటున్నది ఎవరు ? మీరు కాదా

ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీ ఇచ్చినా గానీ రాష్ట్రంలో ఏది చెయ్యాలన్నా అడ్డుకుంటున్నది ఎవరు అంటూ ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి. అంతేకాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి కూడా దర్యాప్తులు జరగకుండా రక్షణ పొందుతున్నది మీ నాయకుడు కాదా అంటూ యనమలను ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుకి కూడా షాక్ ఇచ్చారు. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక చివరికి ఈ స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ పోలీసులపై కేసులు పెట్టాలని చంద్రబాబు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు.

 సీఎంగా పద్నాలుగేళ్ల పాటు పని చేసిన వ్యక్తి క్రిమినల్ సలహాలు ఇస్తున్నాడని ఆరోపణలు

సీఎంగా పద్నాలుగేళ్ల పాటు పని చేసిన వ్యక్తి క్రిమినల్ సలహాలు ఇస్తున్నాడని ఆరోపణలు

సీఎంగా పద్నాలుగేళ్ల పాటు పని చేసిన వ్యక్తి క్రిమినల్ సలహాలు ఇస్తున్నాడు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి. పోలీసుల మీద కేసులు పెట్టి పోలీసులను కాళ్లబేరానికి తెచ్చుకోవాలంట...అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల మనసులు గెలవాలని ఎవరైనా సలహాలిస్తారు కానీ ఈయన పోలీసులు బ్లాక్ మెయిల్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు .

 జూమ్ ద్వారా చంద్రబాబు చేసే నీచ కుట్ర రాజకీయం

జూమ్ ద్వారా చంద్రబాబు చేసే నీచ కుట్ర రాజకీయం

బట్టబయలైంది .. వీడియో పోస్ట్ చేసి షాక్ ఇచ్చిన ఎంపీ
చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. అంతేకాదు జూమ్ ద్వారా చంద్రబాబు చేసే నీచ కుట్ర రాజకీయం బట్టబయలైంది అంటూ ఆ వీడియోని పోస్ట్ చేసి వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం మానేసి టిడిపి కార్యకర్తలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులపై కేసులు పెట్టి వేధించారని దిశానిర్దేశం చేస్తున్నాడంటే ఎంతగా దిగజారారో చూడాలని చంద్రబాబుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

English summary
YCP MP Vijayasai Reddy has taken to social media platforms to lash out at TDP chief Chandrababu, as well as TDP leader Yanamala Ramakrishnudu. Yanamala was furious at the comparison of CM Jaganmohan Reddy to the brutal Draco king. Vijaya Sai Reddy has been accused of being a fake genius. He then posted a video of Chandrababu speaking and shocked Chandrababu that the nefarious conspiracy had been exposed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X