ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..!

ఏపీలో ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించి, అనంతరం ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇప్పుడు రోజుకో విషయాన్ని కెలుకుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందులో హిందూత్వ అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు ఉంటున్నాయి. అలాగే ఇరాన్ వార్ పైనా సాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఈసారి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి ఓ షాకింగ్ ట్వీట్ చేశారు.

ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు ధరలు ఎక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ విజయ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో దేశంలోని ఇతర రాష్ట్రాల పెట్రోల్ ధరల్ని ఆయన ప్రస్తావించారు. వాటిలో లేని పెట్రోల్ ధరలు మనకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటని ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు ₹108.35 చొప్పున అత్యధిక పెట్రోల్ ధరలు ఉండటంలో ఎలాంటి లాజిక్ లేదని సాయిరెడ్డి ఆక్షేపించారు.

Vijayasai Reddy Slams AP s Sky-High Petrol Prices Why higher Than Poorer States

ధనిక రాష్ట్రమైన గుజరాత్ లో లీటర్ పెట్రోల్ ధర ₹94.49, పేద రాష్ట్రమైన యూపీలో ₹94.69 కంటే, దాదాపు సమాన ఆర్థిక స్థితి గల రాష్ట్రమైన మధ్యప్రదేశ్₹106.5 కంటే కూడా మన రాష్ట్రంలో ధర ఎక్కువగా ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటున్న ప్రజలు, వాణిజ్య వాహనాలకు ఇది ఒక భారమని ఆయన తెలిపారు. అయితే ఇందులో ఆయన సీఎం చంద్రబాబు పేరు కానీ, కూటమి ప్రభుత్వం పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ విధిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటోంది కూటమి ప్రభుత్వమే కాబట్టి వారినే సాయిరెడ్డి టార్గెట్ చేసినట్లు అర్దమవుతోంది. వాస్తవానికి వైసీపీ హయాం నుంచీ పెట్రోల్ ధర ఎక్కువగానే ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+