అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ..! హైకోర్టు షాక్ పై సాయిరెడ్డి విశ్లేషణ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి సర్కార్ ఇచ్చిన జీవోల్ని ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతోంది. హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రిజర్వేషన్ల పెంపు చెల్లదని తేల్చిచెప్పేసింది. అయినా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు, గతంలో వైఎస్సార్సీపీ ఇదే అంశంపై ఆడిన డ్రామాను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) బయటపెట్టారు.

AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!
AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కేటాయిస్తున్నాం అని గతంలో వైయస్సార్‌సీపీ, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయని, సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం లిమిట్‌ కన్నా ఎక్కువగా రిజర్వేషన్‌ ఇచ్చాం అని ముందుగా ఒక జీవో జారీ చేయటం,, ఆ తర్వాత ఆ జీవోమీద పిటిషన్లు వీరే వేయించటం, ఆ జీవోలను హైకోర్టు కొట్టేయటం, ఈ వ్యవహారాన్ని ఈ రోజు కూడా చూశామని విజయసాయిరెడ్డి తెలిపారు. 50 శాతం పైగా జనాభా ఉన్న బీసీలతో, ఈ రెండు పార్టీలు నిప్పుతో చెలగాటం ఆడినట్టు చెలగాటం ఆడుతున్నాయని సాయిరెడ్డి ఆక్షేపించారు.

Vijayasai Reddy Slams TDP YSRCP Over Political Drama on BC Reservations After High Court Setback

బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని గమనించలేని టీడీపీ, వైయస్సార్‌సీపీలకు గట్టి గుణపాఠం తప్పదని సాయిరెడ్డి హెచ్చరించారు. 34 శాతం రిజర్వేషన్‌ ఇచ్చేశాం అన్న డ్రామాలతో కలకాలం బీసీలను మోసం చేయటం కుదరదన్నారు. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత, బీసీలు ఈ రెండు పార్టీల మీదా తిరగబడటం ఖాయమన్నారు. స్ధానిక సంస్థలకు గత 12 ఏళ్ళుగా, అంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దక్కాల్సిన నిధుల్ని టీడీపీ, వైయస్సార్‌సీపీ ప్రభుత్వాలు ఏనాడూ సక్రమంగా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా వారికి అందాల్సిన నిధుల్ని ఎక్కడికక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు తమ చేతిలోకి తెచ్చుకున్నారన్నారు. స్థానిక సంస్థల అధికారాలను కూడా మింగేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో నిధులు, అధికారాలు లేని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎవరికి లాభం? ఏం లాభం?అని ప్రశ్నించారు.

PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!
PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!

గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుమీద జరగవు. కానీ మండల ప్రజాపరిషత్తుకు, జిల్లా పరిషత్తుకు జరిగే ఎన్నికలు పార్టీల గుర్తు మీద జరుగుతాయన్నారు. ఎవరి పార్టీ ఎన్ని గెలిచింది అని పనికిమాలిన చర్చ చేయటానికి తప్ప,, ఆ గెలిచిన గ్రామ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు... వీరి వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది అనే చర్చ ఎక్కడా జరగటం లేదన్నారు. ఈ విషయాలన్నీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Vijayasai Reddy Slams TDP YSRCP Over Political Drama on BC Reservations After High Court Setback

స్థానిక సంస్థల్లో మూడు అంచల వ్యవస్థను రెండు కుటుంబ పార్టీలు కేవలం అలంకార ప్రాయంగా మార్చేశాయని, ఖాళీగా ఉన్న తమ నాయకుల్ని సమాజం మీదకు వదిలేందుకు, స్థానిక దోపిడీకి అవకాశంగా మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు ౖటీడీపీ, వైయస్సార్‌సీపీ సిద్ధం అవుతున్నాయన్నారు. నిజాలు ఇలా ఉంటే, బీసీలకు తమలో ఒకరు సామాజిక న్యాయం చేస్తుంటే మరొకరు అడ్డుకుంటున్నారని రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుని ఈ నాటకాన్ని రక్తి కట్టించటానికి పడరాని పాట్లు పడుతున్నాయని విమర్శించారు. ఈ నాటకం, 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలతో చెలగాటం ఆడటమే అని సాయిరెడ్డి విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+