ప్రైవేటీకరణకు పెద్ద బాధితరాష్ట్రం ఆంధ్రప్రదేశ్: విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజ్యసభలో విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రైవేటీకరణ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణకు పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న విజయ సాయి రెడ్డి లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెయ్యి కోట్ల లాభాలు వచ్చాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలలో ఉంది కాబట్టి దానిని ప్రైవేటీకరించ వద్దన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను కేటాయించకపోవడం, హక్కులను పునర్వ్యవస్థీకరించకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లింది అని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ లో జరుగుతున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పన్ను మినహాయింపులు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి అభ్యర్థించారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఎలాంటి సంస్కరణలు చేయలేకపోవడం శోచనీయమని పేర్కొన్న విజయసాయిరెడ్డి, హెల్త్ ఇన్సూరెన్స్ ల పైన జీఎస్టీ ని తగ్గించాలని డిమాండ్ చేశారు.

క్రిప్టోకరెన్సీ దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మెరుగైన నియంత్రణ కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఎక్స్ఛేంజ్ ద్వారా రూట్ చేయని క్రిప్టోకరెన్సీ లావాదేవీలను ప్రభుత్వం ట్రాక్ చేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

క్రిప్టో కరెన్సీపైనా సాయిరెడ్డి వ్యాఖ్యలు

క్రిప్టో కరెన్సీపైనా సాయిరెడ్డి వ్యాఖ్యలు

హవాలా లావాదేవీలు మరియు అక్రమ చెల్లింపులకు అనువైనదిగా ఉన్న వ్యవస్థను మార్చి క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం కాకుండా చూడాలని విజయ సాయి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం 1,000 ఎల్‌ఎన్‌జి స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నందున, ఈ రోజు రాజ్యసభలో దాని అమలుకు సంబంధించిన రోడ్‌మ్యాప్ మరియు నిర్ణయించిన సమయపాలన గురించి విజయ సాయి రెడ్డి కేంద్రానికి ప్రశ్నలు సంధించి వివరాలను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+