"ఆదాయం పెరిగినా ఇవ్వరా ? అది హామీ నిలబెట్టుకున్నట్లా ?- సాయిరెడ్డి పంచ్ లు..!
ఏపీలో సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. ఇప్పుడు నిధుల కొరత కారణంగా చాలా పనులు చేయలేమని చేతులెత్తేస్తోంది. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇంకా అమలు చేయని పథకాలు.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే మరోవైపు ప్రభుత్వానికి గతేడాదితో పోలిస్తే 18 శాతం ఆదాయం పెరిగినట్లు తానే ప్రచారం చేసుకుంటోంది. దీని ఆధారంగా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయం 18% పెరిగిందని సాయిరెడ్డి గుర్తుచేశారు. అయినప్పటికీ, అర్హులైన మహిళలకు నెలకు ₹1,500 అందించే 'ఆడబిడ్డ నిధి' వంటి టీడీపీ ప్రభుత్వ కీలక హామీలు ఇంకా నెరవేరలేదని సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు కేవలం రెండు మూడు నెలల ముందు మాత్రమే కాకుండా, ఐదేళ్లపాటు ప్రజలకు అండగా నిలవడమే హామీ ఉద్దేశ్యమని ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ప్రభుత్వం దీనిని అమలు చేయడానికి వచ్చే ఎన్నికల సమయం వరకు వేచి ఉంటే, దానిని నిజంగా హామీని నెరవేర్చడం అని అనగలమా? అని చురకలు అంటించారు.

#AndhraPradesh’s tax revenue has grown by 18% until this year compared to last year. Yet, key promises of the TDP government remain unfulfilled, including Aadabidda Nidhi to provide ₹1,500 per month to eligible women. A promise is meant to support people for five years, not just…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2026
గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి. దీని ప్రకారం 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ మహిళలకు ప్రతీ నెలా 1500 ఇచ్చేలా హామీ ఇచ్చారు. అయితే ఈ పథకాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వం అమలు చేయడం లేదు. అంతే కాదు దీని గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. దీంతో విపక్ష వైసీపీ ఇప్పటికే పలుమార్లు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తూనే ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే అంశాన్ని పెరిగిన ఆదాయానికి లింక్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరి ఈసారి అయినా ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు ప్రారంభిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.














Click it and Unblock the Notifications