Mood of the Nation Survey: షాకింగ్ రిజల్ట్స్- ఎన్నికలొస్తే ఎన్డీయే, విపక్షాలకు దక్కే సీట్లు ఇవే..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన విద్యార్ధుల ఉద్యమం తర్వాత ఎన్డీయేకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఢిల్లీలో ఆందోళనల మీద పార్లమెంట్ కు వచ్చి ప్రకటన చేయలేని స్దితికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వెళ్లిపోయారు. దీనికి బదులుగా రోజూ విపక్షాలు పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్నా పట్టించుకోకుండా అలాగే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో దేశంలో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇండియా టుడే ఎప్పటిలాగే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే (Mood of the Nation Survey) నిర్వహించింది.

Poll Tracker: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు ? తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు..!
Poll Tracker: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు ? తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు..!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే, ఇండియా కూటముల్లో ఎవరు గెలుస్తారు, లోక్ సభలో ఎవరికి ఆధిక్యం లభిస్తుందన్న ఆంశంపై ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంటుందని ఇందులో తేలింది. కానీ ఈ ఏడాది జనవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించే నాటికి ఉన్న 352 సీట్ల అంచనా నుంచి 326 సీట్లకు పడిపోతుందని తేలింది. అంటే 26 ఎంపీ సీట్లను ఎన్డీయే కోల్పోతుందన్న మాట.

Mood of the Nation NDA Leads With 326 Seats Loses Ground Since January Survey
Poll Tracker: ఈసారి యూపీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు? తేల్చేసిన ఒపీనియన్ పోల్..!
Poll Tracker: ఈసారి యూపీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు? తేల్చేసిన ఒపీనియన్ పోల్..!


కాక్రోచ్ ఉద్యమం తర్వాత నిర్వహించిన ఈ సర్వేలో ఎన్డీయేకు ఓటర్ల ఆదరణ దాదాపుగా చెక్కుచెదరలేదని అర్దమవుతోంది. మరోవైపు విపక్ష ఇండియా కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 185 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంచనా వేసింది. ఈ ఏఢాది జనవరిలో 182 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ లెక్కన చూస్తే గత లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన 234 సీట్లతో పోలిస్తే ఈ రెండూ తక్కువే కావడం విశేషం. ఈ ఏడాది జూలై 1, ఆగస్టు 25 మధ్య మొత్తం 25,184 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు ఇండియా టుడే తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+