చమురుపై కేంద్రానికి సాయిరెడ్డి కీలక సూచన- ఇరాన్ సంక్షోభం వేళ..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న దాడులతో గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇరాన్ పక్కనే ఉన్న హార్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణా చేస్తున్న దేశాలతో పాటు వాటిని అందుకుంటున్న దేశాలకూ చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి తిరిగి భారత్ చమురు కొనుగోళ్లు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అంగీకారం తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇరాన్ యుద్దంలో అమెరికా, ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తున్నందుకు ఇప్పటికే విమర్శల పాలవుతున్న కేంద్రానికి ఇప్పుడు ట్రంప్ పర్మిషన్ తో రష్యా చమురు తీసుకోవాల్సి రావడం మరింత తలనొప్పిగా మారింది. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ట్వీట్ చేశారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీని ఉద్దేశించి సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.

The Govt’s assurance that petrol prices will not rise due to the #IranWar is reassuring. However, given the situation, it is important that the conflict ends soon and key routes stabilise. Urging Hon’ble Petroleum Minister @HardeepSPuri ji to explore alternate supply routes and…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 6, 2026
ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగవని ప్రభుత్వం హామీ ఇవ్వడం భరోసానిస్తుందని సాయిరెడ్డి తెలిపారు. అయితే, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వివాదం త్వరగా ముగిసి కీలక మార్గాలు స్థిరీకరించడం చాలా ముఖ్యమని ఆయన వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థను ఇలాంటి అంతరాయాల నుండి రక్షించడానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, సోర్సింగ్ ఎంపికలను అన్వేషించాలని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరుతున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ లో తెలిపారు. ఇరాన్ వార్ తో తలెత్తిన చమురు సంక్షోభం నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications