Iran: గల్ఫ్ దేశాలు తిరిగి ఎందుకు దాడులు చేయట్లేదంటే ? ఇరాన్ రాయబారి రీజన్..!

ఇరాన్(iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) మూకుమ్మడిగా చేస్తున్న దాడులు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్ని ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో ఆయా దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే తిరిగి ఇరాన్ పై మాత్రం ప్రతి దాడులు చేయడం లేదు. దీనిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని భారత్ లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ఇవాళ పరోక్షంగా వెల్లడించారు.

ఇరాన్ ఈ యుద్ధం విషయంలో నిజాయితీగా ముందుకు వెళ్తోందని భారత్ లోని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలి తెలిపారు. కానీ అమెరికా-ఇజ్రాయెల్ బహిరంగ శత్రుత్వాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. యుద్ధాన్ని వారు ప్రారంభించారు కానీ యుద్ధం యొక్క వ్యవధి మాత్రం తమ చేతుల్లో ఉందని ఆయన వెల్లడించారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని, వారు ప్రారంభించారని, యుద్ధం యొక్క వ్యవధి, ముగింపు తమ చేతుల్లో ఉందని తాము చాలాసార్లు చెప్పామని గుర్తుచేశారు.

Iran s Ambassador to India Clarifies Attacks Target Only US Bases Not Gulf Nations

ఇది చాలా ముఖ్యమన్నారు. తాము తమ పొరుగు దేశాలపై దాడి చేయమని, వారు అమెరికాకు స్థావరాలను ఇచ్చారని, అందుకే వాటిపై మాత్రమే దాడులు చేస్తున్నట్లు రాయబారి తెలిపారు. తమ పొరుగువారితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తాము అమెరికా స్థావరాలపైనే దాడి చేశామని అన్ని పొరుగుదేశాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ స్థావరాల నుండి అమెరికా తమ దేశ ప్రాథమిక పాఠశాలలను లక్ష్యంగా చేసుకుందన్నారు. 160 మంది ప్రాథమిక విద్యార్థులను పొట్టనబెట్టుకుందన్నారు. కానీ తాము మాత్రం కేవలం వారి స్థావరాలపై మాత్రమే దాడి చేసామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+