వాళ్లను చంపేస్తాం.. యుద్ధం ఆగదు: ఇరాన్ సంచలన వార్నింగ్

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడులు రోజురోజుకూ ఉద్ధృతం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం.. ఇరాన్ సుప్రీం లీడ్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.

అయితే తాజాగా యుద్ధంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలు జరపాలన్న ఆలోచనలో ఇరాన్ లేదని ఖమేనీ సన్నిహితుడు మహమ్మద్ మక్బర్ తేల్చి చెప్పారు. తమకు అవసరం ఉన్నంత కాలం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అమెరికాతో చర్చలు లేవని.. యుద్ధాన్ని కొనసాగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాను తాము నమ్మలేమని తేల్చారు.

మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు సంబంధించి సపోర్ట్ గా ఏమైనా మాట్లాడినా.. చేసినా కఠిన శిక్షలు ఉంటాయని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ స్పష్టం చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు ఏ విధంగా సహకరించినా మరణశిక్ష విధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం యుద్ధ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాకు సహకరించిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్ లోని మషాద్ నగరంలోని ఖమేనీ ప్రార్థనా స్థలంలోనే అంత్యక్రియలను చేయనున్నట్లు సమాచారం అందుతోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు అంత్యక్రియలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనున్నట్లు వివరించారు.

Iran Rejects US Talks latest row No Negotiations War Continues Tehran Issues Firm Warning

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో రెచ్చిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+