బెదిరిన రాములమ్మ: అసెంబ్లీకి, అధిష్టానం పరిశీలన

తాను శాసనసభకు పోటీ చేస్తానని ఆమె కాంగ్రెసు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్‌నుంచి లోకసభకు పోటీ చేసిన పక్షంలో అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి విజయశాంతిని దింపాలనే యోచనలో పార్టీ అధిష్టానవర్గం వున్నట్టు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి మరో రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం వుంది.
కెసిఆర్ వ్యూహాన్ని బట్టి విజయశాంతి వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలన్నది కాంగ్రెసు అధిష్టానం యోచనగా భావిస్తున్నారు. తెరాస నుంచి మెదక్ పార్లమెంటు సీటు నుంచి 2009లో గెలిచిన విజయశాంతి అనూహ్యంగా తెరాస నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మెదక్ లోకసభ స్థానం నుంచే పోటీ చేస్తానని, కెసిఆర్‌నైనా ఎదుర్కుంటానని ఆమె చెబుతూ వచ్చారు.
కానీ అకస్మాత్తుగా ఆమె తన ఆలోచనను విరమించుకుని, శాసనసభకు పోటీ చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆమె ఆలోచనలోని ఆంతర్యమేమిటో తెలియడం లేదు.












Click it and Unblock the Notifications