అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గన్నవరం విమానాశ్రయం సామర్థ్యం రెట్టింపు, రూ.130 కోట్ల ఖర్చు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా... విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి రెండింతలు చేయాలని యోచిస్తోంది. ఈ విమానాశ్రయ సామర్థ్యాన్ని పదిలక్షల ప్రయాణీకుల వరకు పెంచానుంది. ప్రస్తుతం ఏడాదికి నాలుగు లక్షల ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.

నూతన ఇంటర్మ్ టెర్మినల్ భవనానికి త్వరలో పునాది రాయి వేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం సామర్థ్యం నెలకు దాదాపు 35,000గా ఉంది. అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉంటుంది.

Vijayawada airport capacity to one million

కొత్త ఇంటర్మ్ టెర్మినల్ బిల్డింగ్ సామర్థ్యాన్ని ఏడాదికి పది లక్షలకు పెంచనున్నట్లు చెబుతున్నారు. దీని కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.130కోట్లు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. 9,500 స్వేక్ మీటర్ల ఏరియాలో నిర్మించనున్నారు.

ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పదిహేను నెలల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజులు పునాది రాయి వేశాక పనులు ప్రారంభం కానున్నాయి.

English summary
Airports Authority of India is in the process of increasing the passenger handling capacity of Vijayawada airport at Gannavaram to one million passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X