రాజధాని పేరుతో మాఫియా సిటీ: బాబుపై తమ్మినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వైయస్సార్ కాగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజధాని భూ మాఫియాపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆయన బుధవారం మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, సాడిల్, పొలిటికల్, కార్పొరేట్ మాఫియాలున్నాయని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, చంద్రబాబు అనుచరులు గబ్బిలాల మాదిరిగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కబ్జాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో జరిగిన హత్యలు కూడా ఈ నేపథ్యంలోనే జరిగాయని ఆయన అన్నారు.
విజయవాడను చంద్రబాబు మాఫియా సిటీగా తయారు చేయబోతున్నారా అని ఆయన అడిగారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి వద్ద విజయవాడ - ఏలూరు జాతీయ రహదారి పైన కారులో వెళ్తున్న ముగ్గురిని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications