బెజవాడ గోడౌన్లో రూ.2.5 కోట్ల ఐఫోన్ల దోపిడీ-24 గంటల్లోనే దొరికిపోయిన యూపీ ముఠా.!
విజయవాడలో నాలుగు రోజుల క్రితం ఓ భారీ దోపిడీ జరిగింది. నగర శివారు ప్రాంతమైన ఎనికేపాడులో ఉన్న ఓ ఐఫోన్ గోడౌన్ కు కన్నమేసిన ఉత్తర్ ప్రదేశ్ ముఠా.. ఏకంగా 2.5 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకుపోయింది. అత్యంత చాకచక్యంగా సీసీ కెమెరాలను కూడా ఏమార్చి ఈ ముఠా చేసిన దోపిడీని పోలీసులు అంతకంటే చాకచక్యంగా 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుల్ని ఒడిషా-బీహార్ సరిహద్దుల్లో పట్టుకుని విజయవాడకు తరలిస్తున్నారు. అయితే ఈ దోపిడీ విధానం పోలీసులకు సైతం షాకిచ్చింది.
ఈ రోజుల్లో ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే చాలు పోలీసులు సీసీ ఫుటేజ్ ల కోసం వెతుకుతున్నారు. దీంతో ఎనికేపాడులో ఉన్న ఇన్ గ్రామ్ ఐఫోన్ గోడౌన్ లో జరిగిన దోపిడీలో యూపీ ముఠా ముందుగా సీసీ కెమెరాలను మరో దిక్కుకు తిప్పేసి, వాటి వైర్లు కత్తిరించేసి చాలా పకడ్బందీగా దోపిడీ చేసింది. గోడౌన్ రేకులు తొలగించి వాటిలో నుంచి కిందకు దిగి ముఠా సభ్యులు వందల ఐఫోన్లను చాలా తెలివిగా ఎత్తుకుపోయారు. దీంతో కేసు నమోదు చేసిన విజయవాడ పటమట పోలీసులు రంగంలోకి దిగారు.

ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 5వ తేదీ అర్థరాత్రి 12.58 గంటల సమయంలో ఇద్దరు యూపీ ముఠా దొంగలు గోడౌన్ వెనుక వైపు గోడ దూకి ప్రవేశించినట్లు తేలింది. ముందు వైపు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా వీరిని చూడలేదు. గోడౌన్ ఆనుకుని వాటర్ ట్యాంకు కోసం నిర్మించిన గదిపైకి ఎక్కి కట్టర్‌తో రేకులు కత్తిరించి చొరబడ్డారు. లోపల ఉన్న సీసీ కెమెరాల కేబుళ్లు కట్ చేశారు. అనంతరం లోపలికి ప్రవేశించి ఐఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు.
గోడౌన్ లో మొత్తం 6 కోట్ల విలువైన వస్తువులు ఉన్నట్లు తేల్చారు. యాపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ కంపెనీల ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. వీటిలో ఖరీదైన వస్తువులను మాత్రం ఎంచుకుని ఎత్తుకుపోయారు.
ఈ చోరీలో మొత్తం 171 యాపిల్ ఐఫోన్లు, 75 యాపిల్ ఇయర్ బడ్స్, రెండు ఐప్యాడ్‌లు దోచుకెళ్లారు. ఇలా మొత్తం రూ.2.5 కోట్లు విలువ చేసే 371 వస్తువులు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మధ్యప్రదేశ్ రిజిస్టరేషన్ మారుతీ ఎర్టిగా కారులో గన్నవరం వైపు వెళ్లారు. దీంతో ఫాస్టాగ్ ఆధారంగా కారు వివరాలు గుర్తించారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఒడిశా దాటి బిహార్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుసుకుని అక్కడి పోలీసులను అలర్ట్ చేసి పట్టుకున్నారు. వీరిని విజయవాడకు తెస్తున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications