విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఒక్క సంఘటన.. కేశినేని ఎందుకెళ్లారంటే..: ఇద్దరు నేతలకు బ్రేక్

కొద్ది రోజుల క్రితం విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద జరిగిన వివాదం ఇద్దరు రాజకీయ నాయకులకు మొదటికే మోసం తెచ్చాయని అంటున్నారు. ఒకటి ఎంపి కేశినేని నాని, రెండోవారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కొద్ది రోజుల క్రితం విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద జరిగిన వివాదం ఇద్దరు రాజకీయ నాయకులకు మొదటికే మోసం తెచ్చాయని అంటున్నారు. ఒకటి ఎంపి కేశినేని నాని, రెండోవారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు.

కేశినేని ట్రావెల్స్ బాటలో మరికొన్ని..: అవి షాకిస్తున్నాయి, ఏళ్లకు ఇలా చెక్! కేశినేని ట్రావెల్స్ బాటలో మరికొన్ని..: అవి షాకిస్తున్నాయి, ఏళ్లకు ఇలా చెక్!

ఎంపీ కేశినేని నాని తన ట్రావెల్స్‌ను మూసివేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వ్యాపారం చేసినప్పుడు తెలివిగా ముందుకెళ్లాలని, అంతేకానీ మూసివేయడం సరికాదనే అంటున్నారు.

ఏది ఏమైనా ఇప్పుడు కేశినేని నాని తీరుపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఒక్క రవాణా శాఖ కార్యాలయం సంఘటన బోండా ఉమ, కేశినేని నానికి నష్టం చేకూర్చిందని అంటున్నారు.

నష్టాలు వచ్చాయి కానీ..

నష్టాలు వచ్చాయి కానీ..

రాష్ట్ర విభజన అనంతరం ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. విభజన తర్వాత పన్నులు పెరగడం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల నుంచి లగేజీ వేసుకొని వచ్చి బస్సులు తిరగడం, తెలుగు రాష్ట్రాలలోని బస్సుల్లో లగేజీ వేయకూడదనే నిబంధనలు.. ఇలా పలు కారణాల వల్ల నష్టాలు వస్తున్నాయి.

పలుమార్లు ఫిర్యాదు చేసిన నాని

పలుమార్లు ఫిర్యాదు చేసిన నాని

కేశినేని ట్రావెల్స్‌కు 350 బస్సులు ఉండగా, నష్టాల కారణంగా ఫైనాన్స్ కట్టలేక వంద బస్సులకే పరిమితం అయింది. బస్సులను అమ్మేసి ఫైన్ కట్టారు. వరుస నష్టాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులపై కేశినేని నాని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

ఇదీ ఓ కారణం

ఇదీ ఓ కారణం

విజయవాడలో ఓ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ నివేదిక కోసం కేశినేని నానికి చెందిన వ్యక్తి తొలుత రవాణా శాఖ కార్యాలయం వెళ్లారు. ఆ తర్వాత కేశినేని నాని, బోండా ఉమ వెళ్లారు. అక్కడ కేశినేని నాని రవాణా శాఖ అధికారిని అడ్డుకోవడం, బోండా ఉమ గన్‌మెన్‌ను తోసివేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఇద్దరికి షాక్

ఇద్దరికి షాక్

ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ మేరకు కేశినేని నాని, బోండా ఉమలు అధికారులకు క్షమాపణ చెప్పారు. అయితే, ట్రావెల్స్ నష్టాల ఒత్తిడిలో ఉన్న కేశినేని నాని తన ఆగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాలని మూసివేయాలనుకున్నారని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కారణంగా కేశినేని నాని తన ట్రావెల్స్‌ను మూసివేశారు. మరోవైపు, కేబినెట్లో చోటు దక్కించుకోవాల్సిన బోండా ఉమకు అది దక్కకుండా పోయిందన అంటున్నారు. ఈ ఎపిసోడ్ బోండా ఉమ రాజకీయ జీవితానికి, కేశినేని నాని వ్యాపారానికి బ్రేక్ వేసిందని అంటున్నారు.

English summary
MLA Bonda Umamaheswara Rao and Kesineni Nani affected with Vijayawada RTA office incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X